Advertisementt

కుటుంబ సభ్యుల సమక్షంలో కీర్తి సురేష్ పెళ్లి

Thu 12th Dec 2024 03:03 PM
keerthy suresh  కుటుంబ సభ్యుల సమక్షంలో కీర్తి సురేష్ పెళ్లి
Keerthy Suresh marries Antony Thattil in Goa కుటుంబ సభ్యుల సమక్షంలో కీర్తి సురేష్ పెళ్లి
Advertisement
Ads by CJ

మహానటి కీర్తి సురేష్ పెళ్లైపోయింది. చిన్ననాటి స్నేహితుడు ఆంటోని తో తన మెడలో మూడు ముళ్ళు వేయించుకుని మురిసిపోయింది. హీరోయిన్స్ సినిమాల్లో భాగంగా ఎన్నోసార్లు పెళ్లి పీటలెక్కుతారు. కానీ రియల్ లైఫ్ లో పెళ్లి చేసుకునే క్షణాల కోసం వెయిట్ చేస్తారు. వాళ్ల కన్నా ఎక్కువగా అభిమానులు తమ అభిమాన తారల పెళ్లిళ్ల కోసం ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటారు. 

ఇక తన పెళ్లి గోవాలో డిసెంబర్ 12 న జరుగుతున్న విషయాన్ని కీర్తి సురేష్ స్వయానా ప్రకటించాక ఆమె తన కెరీర్ లో బిజీగా ఉంటూనే ఈరోజు తన బాయ్ ఫ్రెండ్ ఆంటోని తో పెళ్లి పీటలెక్కి ఏడడుగులు నడిచింది. హిందూ సంప్రదాయం ప్రకారం కీర్తి సురేష్-ఆంటోనీల వివాహం గోవాలో అతికొద్దిమంది కుటుంబ సభ్యులు, స్నేహతుల నడుమ గ్రాండ్ గా జరిగిపోయింది. 

ఎలాంటి హంగు హార్భాటాలు లేకుండానే కీర్తి సురేష్ సింపుల్ గా పెళ్లి చేసుకుని షాకిచ్చింది. ప్రస్తుతం కీర్తి సురేష్-ఆంటోని వెడ్డింగ్ ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆంటోని కీర్తి సురేష్ మెడలో మాంగల్యధారణ చేస్తున్న సమయంలో ఎమోషనల్ అవుతూ కనిపించింది. అభిమానులు ఆమెపె ళ్ళి ఫొటోస్ ని ట్రెండ్ చేస్తూ ఆమెకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

Keerthy Suresh marries Antony Thattil in Goa:

Keerthy Suresh and Antony Thattil are married

Tags:   KEERTHY SURESH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ