మంచు వారి వివాదం మీడియా దగ్గర నుంచి పోలీస్ స్టేషన్ మెట్లెక్కేవరకు ముదిరిపోయింది. ఆస్తుల వ్యవహారంతో పాటుగా మోహన్ బాబు విద్యాసంస్థల వ్యవహారం కూడా మంచు ఇష్యులో హైలెట్ అయ్యింది. మంచు మనోజ్ vs మోహన్ బాబు అన్న రేంజ్ లో జరిగిన గొడవల్లో మంచు విష్ణు సైలెంట్ గా ఉండడం గమనార్హం. గతంలో అన్నదమ్ముల మద్యన జరిగిన రచ్చ ఇప్పుడు తండ్రి కొడుకు మధ్యన జరగడం మరో విశేషం.
అయితే మనోజ్ ప్రేమ వ్యవహారంలో అతన్ని వెనకేసుకొచ్చి పెద్దమనిషి తరహాలో తమ్ముడికి దగ్గరుండి పెళ్లి జరిపించిన మంచు లక్ష్మి తండ్రి-కొడుకుల ఆస్తి వ్యవహారంలో కనిపించకపోవడం పై నెటిజెన్స్ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. షూటింగ్స్ కోసం ముంబైలో ఉంటున్న మంచు లక్ష్మి హుటాహుటిన మనోజ్-మోహన్ బాబు నడుమ పంచాయతీ చక్కదిద్దెందుకు సోమవారమే ముంబై నుంచి రాగా.. మోహన్ బాబు ఆమెని వెనక్కి పంపించేసినట్లుగా చెబుతున్నారు.
తమ్ముడి ప్రేమను అన్న విష్ణు, తండ్రి మోహన్ బాబు వ్యతిరేఖించినా లక్ష్మి మాత్రం సపోర్ట్ చేస్తూ మనోజ్ పెళ్లి కి నడుం బిగించింది. ఆమె ఎప్పుడు మనోజ్ పక్షంలోనే ఉండడంతో విష్ణుకి లక్ష్మి కూడా పొరపొచ్ఛాలొచ్చాయనే టాక్ ఉంది. విష్ణు కూడా నిన్నటి ప్రెస్ మీట్ లో మా అక్కకు నాకు విభేదాలు ఉన్నాయి, అయినప్పటికీ ఆమె తిడితే పెద్దది కాబట్టి పడతాను అని చెప్పారు.
మరి మంచు ఫ్యామిలిలో ఇంత జరుగుతున్నా మంచు లక్ష్మి స్పందించకపోవడం మాత్రం నిజంగా షాకిచ్చే విషయమే.