రామ్ చరణ్-ఉపాసన ఇద్దరూ మెగా మనవరాలు క్లింకార ని ఇప్పటివరకు రివీల్ చెయ్యట్లేదు. క్లింకార పుట్టి ఏడాదిన్నర అయినప్పటికీ ఇప్పటివరకు క్లింకార ఫేస్ రివీల్ చెయ్యకుండా మెగా అభిమానులు వెయిట్ చేసేలా చేస్తున్నారు. చరణ్-ఉపాసన తమ కూతుర్ని ఎక్కడికి తీసుకెళ్ళినా మీడియా కంట పడకుండా పాపని హైడ్ చేస్తూనే ఉన్నారు.
తాజాగా ఉపాసన తన గ్రాండ్ పేరెంట్స్, అలాగే తండ్రి తో పాటుగా అపోలో ఆసుపత్రిలో వేంకటేశ్వర వామి వారి పవిత్రోత్సవాల్లో పాల్గొన్నారు. అక్కడ ఉపాసన తండ్రి క్లింకార ని ఎత్తుకుని ఉన్న పిక్ ని ఉపాసన షేర్ చేసింది. తాత చేతిలో ఉన్న క్లింకార ని చూస్తుంటే.. తనకి చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి.
తనకి ఈ గుడి చాలా ప్రత్యేకమని చెప్పిన ఉపాసన ఈ ఆనందకర క్షణాలను ఎప్పటికి మర్చిపోలేను అంటూ రాసుకొచ్చింది. ఆ పిక్ లోను క్లింకార ఫేస్ సైడ్ నుంచే కనిపించింది కానీ పాప పూర్తి పేస్ చూపించనేలేదు. అది చూసిన అందరూ రామ్ చరణ్ ఇంకెప్పుడు క్లింకార దర్శనం, ఎన్నాళ్లీ దాపరికం చరణూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.