లక్కీ భాస్కర్ తో ఒక్కసారిగా పాపులర్ అయిన మీనాక్షి చౌదరి ఈ ఏడాది వరస సినిమాల్తో అభిమానులకు ట్రీట్ ఇస్తూ వచ్చింది. అందులో కొన్ని ఆమెకి బిగ్ షాకే ఇచ్చాయి. ఒకే నెలలో వరస సినిమాలతో వచ్చిన మీనాక్షి మళ్ళీ షార్ట్ గ్యాప్ లో సంక్రాంతి ఫెస్టివల్ కి సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో రాబోతుంది.
మీనాక్షి చౌదరి స్లిమ్ గా ఉంటుంది. ఫిట్ గా ఉంటుంది. మరి మీనాక్షి చౌదరి టాప్ హీరోయిన్స్ మాదిరి ఏ యోగా చేసో, లేదంటే ఏ జిమ్ లో వర్కౌట్స్ చేస్తుందో అనేది ఏ వీడియో ద్వారానో కూడా కనిపించలేదు. తాజాగా మీనాక్షి చౌదరి తన ఫిట్ నెస్ రహస్యాన్ని బయటపెట్టింది. నేను ఇంత ఫిట్ గా ఉండడానికి మెయిన్ రీజన్ నా ఫాదర్.
ఆయన చిన్నప్పటి నుంచి నన్ను గేమ్స్ లో ఉండేలా ఎంకరేజ్ చేసేవారు. నా వెంట ఉండి స్పోర్ట్స్ లో ట్రైనింగ్ ఇప్పించారు. అలా నేను స్విమ్మింగ్, బ్యాడ్మింటన్‌లో స్టేట్ లెవల్ ప్లేయర్‌గా కొనసాగాను. మరి స్పోర్ట్స్ పర్సన్ కి సహజంగానే ఫిట్ నెస్ ఉండాలి. అప్పట్లో ఫిట్‌గా ఉండేందుకు వర్కౌట్లు ఎక్కువ చేసే దాన్ని, ఇప్పుడు సినిమాల్లోకి వచ్చాక కూడా అదే అలవాటుతో రెగ్యులర్‌గా తాను ఫిట్‌నెస్ కోసం ఎక్కువగా వర్కౌట్‌లు చేస్తూ ఉంటాను అంటూ ఫిట్ నెస్ సీక్రెట్ చెప్పుకొచ్చింది.