Advertisementt

బన్నీపై సీఎం రేవంత్ రివెంజ్ తీర్చుకున్నారా..

Fri 13th Dec 2024 02:59 PM
allu arjun  బన్నీపై సీఎం రేవంత్ రివెంజ్ తీర్చుకున్నారా..
Did CM Revanth take revenge on Bunny బన్నీపై సీఎం రేవంత్ రివెంజ్ తీర్చుకున్నారా..
Advertisement
Ads by CJ

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు, అనుచరులను కలచివేస్తోంది. ఇటీవల పుష్ప 2 సక్సెస్ మీట్ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మరిచిపోయారు. దీనికి తోడు మునుపెన్నడూ, ఎవరికీ రాని పేరు ఈ ఒక్క సినిమాతో బన్నీకి వచ్చింది. దీంతో ఎక్కడ చూసినా, ఎవరి నోట విన్నా అల్లు అర్జున్ పేరు మారుమోగిపోతోంది. సీఎం పేరు మర్చిపోయినందుకు కక్ష సాధింపు చర్యలకు దిగారా? అనే సందేహాలు అందరిలోనూ మెదులుతున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే పెద్ద చర్చ అయ్యింది.

ఎందుకంటే..?

కేవలం ఎంక్వయిరీ మాత్రమే అయితే ఇలా చెప్పులు కూడా వేసుకోనివ్వకుండా పదుల సంఖ్యలో పోలీసులు వచ్చి జీప్ ఎక్కించుకొని వెళ్లాల్సిన అవసరం ఏముంది? థియేటర్ వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడే బన్నీని కూడా అప్పుడే ఎందుకు అరెస్ట్ చేయలేదు? మరీ ఇలా బెడ్ రూంలోకి వచ్చి అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? కనీసం బట్టలు మార్చుకునే సమయం ఇవ్వరా? నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయడం ఎంతవరకూ కరెక్ట్..? ఇలా ఒకటా రెండా లెక్కలేనన్ని ప్రశ్నలు ప్రభుత్వం, పోలీసులపై అభిమానులు, న్యాయ నిపుణులు, నెటిజన్లు సంధిస్తున్నారు. రివెంజ్, డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో రేవంత్ రెడ్డి దిట్ట అని అభిమానులు దుమ్మెత్తి పోస్తున్నారు.

నాన్న నువ్వు దిగు..?

నన్ను అరెస్ట్ చేయడం తీసుకెళ్లడం తప్పు కాదు కానీ, ఇలా బెడ్రూం లోపలికి వచ్చి అరెస్ట్ చేయడం మంచి విషయం కాదు. నాకు ఏమీ కాదు ధైర్యంగా ఉండు అని చెప్పి భార్య స్నేహా రెడ్డికి చెప్పి ఇంటి నుంచి బన్నీ బయటికి వచ్చాడు. మరోవైపు.. ఏ క్రెడిట్ వచ్చినా, నా పేరు మీదే ఉండాలి. గుడ్ అయినా, బ్యాడ్ అయినా నాకే నువ్వు రావద్దు అని చెప్పి తండ్రి అల్లు అరవింద్‌ను పోలీస్ వాహనం నుంచి దిగమని చెప్పాడు అల్లు అర్జున్. అనంతరం అదే పోలీసు వాహనంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వరకూ వెళ్ళాడు. మరోవైపు అల్లుడుకి క‌ష్టం రాగానే వెంట‌నే స్టేష‌న్‌కు మామ‌ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి రంగంలోకి దిగిపోయారు. ఐతే పోలీసులు ఆయన్ను లోనికి రానివ్వలేదు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి కూడా షూటింగ్ మధ్యలో ఆపేసి పోలీస్ స్టేషన్ వచ్చారు. మొత్తానికి చూస్తే ఉదయం నుంచి అంతా హడావుడిగా నడుస్తోంది.

Did CM Revanth take revenge on Bunny:

Did CM Revanth take revenge on Allu Arjun

Tags:   ALLU ARJUN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ