ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వేదికగా తొలిసారి స్పందించారు. ప్రస్తుతం హోం శాఖ రేవంత్ దగ్గరే ఉంది.. దీంతో శాంతిభద్రతలు, లా అండ్ ఆర్డర్ మొత్తం ఆయనే చూసుకుంటూ ఉండటంతో నిన్నటి వరకూ నడిచిన మంచి ఫ్యామిలీ వివాదం, బన్నీ అరెస్టుపై మీడియాతో ఇష్టాగోష్టిలో భాగంగా మాట్లాడారు.
నా జోక్యం లేదు..!
అల్లు అర్జున్ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఇందులో నా జోక్యం ఏమీ ఉండదు. చట్టం ముందు అందరూ సమానులే. చట్టపరమైన ప్రక్రియ జరుగుతుంది. తొక్కిసలాటలో ఒకరు చనిపోయిన నేపథ్యంలో పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. మోహన్ బాబు విషయంలో కోర్టు ఉత్తర్వులున్నాయి అని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. కాగా రేవంత్ రెడ్డి రివెంజ్ తీర్చుకుంటున్నట్లు పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇలా స్పందించారు.