హైదరాబాద్ సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అరెస్ట్ అయిన అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు బెయిల్ నిరాకరించింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో 11 వ నిందితునిగా ఉన్న అల్లు అర్జున్ ని ఈ రోజు అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆయన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ ను ప్రవేశపెట్టారు పోలీసులు.
నాంపల్లి కోర్టులో ఇరు వాదనలు విన్న జెడ్జి అల్లు అర్జున్ బెయిల్ నిరాకరిస్తూ 14రోజులు రిమాండ్ విధించడం హాట్ టాపిక్ అయ్యింది. బెయిల్ రిజెక్ట్ అవడంతో అల్లు అర్జున్ ని చంచల్ గూడా జైలుకి తరలించే అవకాశ ఉంది, మరోపక్క అల్లు అర్జున్ కేసు లో హై కోర్టులో వాదనలు జరుగుతున్నాయి.