జగన్ ఆదేశాలు.. బన్నీ కోసం రంగంలోకి వైసీపీ ఎంపీ!
వామ్మో.. ఇదేంటి అల్లు అర్జున్ అరెస్ట్ ఎక్కడి నుంచి ఎక్కడికి లింకులు వెళ్తున్నాయ్..? అని ఆశ్చర్యపోతున్నారా..? అవునండోయ్ ఏదైనా జరగొచ్చు. ఇప్పుడు పరిస్థితులు అలా ఉన్నాయ్ మరి. వాస్తవానికి 2024 ఎన్నికల నుంచి బన్నిపై వైసీపీ కార్యకర్తలు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వీరాభిమానులు విపరీతమైన ఇష్టం పెంచుకున్నారు. ఇందుకు కారణం ఎన్నికల సమయంలో నంద్యాల నుంచి వైసీపీ నుంచి పోటీ చేసిన మిత్రుడు కోసం మద్దతుగా రావడమే. దీనికితోడు కాస్త మెగా ఫ్యామిలీకి కాస్త వ్యతిరేఖంగా ఉంటున్న పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి అరెస్ట్ వరకూ అల్లు అర్జున్ అంటే చాలు నెత్తికి ఎత్తుకుంటున్నారు.
జగన్ ఎలా.. ఏం అవసరం..?
ఇక అసలు విషయానికొస్తే.. అల్లు అర్జున్ అరెస్ట్ విషయాన్ని వైఎస్ జగన్ కాస్త సీరియస్ గా తీసుకున్నారని ఏపీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం అల్లు అర్జున్ పక్షాన హైకోర్టులో కేసును పరిశీలిస్తున్న న్యాయవాది నిరంజన్ రెడ్డి వైసీపీ రాజ్యసభ ఎంపీ కావడమే. నిరంజన్.. వైఎస్ జగన్ రెడ్డికి అత్యంత ఆప్తుడు.. నాడు అక్రమాస్తుల కేసులు మొదలుకుని నిన్నమొన్నటి ఆస్తుల వ్యవహారం వరకూ అన్నీ ఆయనే చూస్తున్నారు. దీంతో ఆయనకు ఎంపీగా ప్రమోషన్ కూడా ఇచ్చారు జగన్. ఆయనే ఇప్పుడు అల్లు అర్జున్ కేసు చూస్తుండటంతో వైఎస్ జగన్ నేరుగా రంగంలోకి దిగి, నిరంజన్ ర్ డ్డిని పంపించారని.. ఇదంతా మాజీ సీఎం చేస్తున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తునే చర్చ జరుగుతోంది. నిరంజన్ రెడ్డి నిర్మాత కూడా.
ఏం జరుగుతుందో..?
అల్లు అర్జున్ క్వాష్ పిటిషనుపై లంచ్ మోషన్ విచారణ జరపాలని జస్టిస్ జువ్వాడి శ్రీదేవి కోర్టులో న్యాయవాదులు నిరంజన్ రెడ్డి, అశోక్ రెడ్డి మెన్షన్ చేశారు. హైకోర్టులో విచారణ ప్రారంభం కాగా మరికాసేపట్లో తీర్పు ఇవ్వనుంది. ఐతే.. సోమవారం వరకు అరెస్టు చేయకుండా ఆర్దర్స్ ఇవ్వాలని న్యాయవాదులు కోరుతున్నారు. ఇదిలా ఉంటే నాంపల్లి కోర్టు బన్నీకి 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను చంచల్ గూడ జైలుకు పోలీసులు తరలించారు. మరోవైపు వీకెండ్ అరెస్ట్ చేయడం వెనుక బెయిల్ రాకుండా చేయడమేనా..? ఎందుకు ఇంత రాజకీయ ప్రోద్బలం..?నిన్న రైతులకు బేడీలు వేసిన విషయం వైరల్ అవ్వడంతో.. డైవర్షన్ కోసం నేషనల్ అవార్డు విన్నింగ్ నటుడు బన్నీని అరెస్ట్ చేశారా? లేక సినిమా ఫంక్షనులో పేరు మర్చిపోవడం వల్లనేనా? అనే అనుమానాలు గంట గంటకు పెరుగుతున్నాయని బన్నీ అభిమానులు మండిపడుతున్నారు