టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ కు హైకోర్టులో ఊరట దక్కింది. ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు మంజూరు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. నటుడు అయినందు వల్లే అతడిని ఇరికించొచ్చా..? అని ప్రభుత్వంపై, పోలీసులపై హైకోర్టు ఒకింత కన్నెర్రజేసింది. అతనికి కూడా జీవించే హక్కు, స్వేచ్ఛ ఉందని, ఒకరు చనిపోవడం తమకు కూడా బాధగా ఉందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.