నిన్న శుక్రవారం సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అరెస్ట్ అయ్యి ముందుగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించిన అల్లు అర్జున్ ని తర్వాత మెడికల్ టెస్ట్ ల అనంతరం నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ ని హాజరు పరిచారు పోలీసులు. అయితే నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కి ఈ కేసులో 14 రోజుల రిమాండ్ విధించగా పోలీసులు ఆయన్ను చంచల్ గూడా జైలుకి తరలించారు.
ఈలోపులో అల్లు అర్జున్ కు తెలంగాణ హై కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినా అనుకున్న సమయానికి జైలు అధికారులకు బెయిల్ పీలా అందకపోవడంతో గత రాత్రి అల్లు అర్జున్ జైలులోనే ఉండాల్సి వచ్చింది. ఈరోజు ఉదయం 6 తర్వాత అల్లు అర్జున్ చెంచాల గూడా జైలు నుంచి విడుదలై వెనుక గేటు గుండా ఆయన జూబ్లీహిల్స్ లోని గీత ఆర్ట్స్ ఆఫీస్ కి వెళ్లిపోయారు.
అక్కడ ఆయన్ని కలిసేందుకు నిర్మాతలు క్యూ కట్టారు, ఆ తర్వాత అల్లు అర్జున్ గీత ఆర్ట్స్ ఆఫీస్ నుంచి తన నివాసానికి వెళ్లగా అక్కడ ఆయన భార్య, పిల్లలను హత్తుకుని కాస్త ఎమోషనల్ అయినట్టుగా కనిపించింది. ప్రస్తుతం ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు.