బిగ్ బాస్ సీజన్ 8 లో కన్నడ సీరియల్ బ్యాచ్ లో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ గా కృష్ణ ముకుంద మురారి ఫేమ్ ప్రేరణ అడుగుపెట్టింది. సీజన్ స్టార్టింగ్ నుంచి ఆమె విష్ణుప్రియ తో ఫుడ్ విషయంలో గొడవ పెట్టుకుంటూ ఉంది. టాస్క్ ల్లో తోపు గా ఆడే ప్రేరణ మాటల పరంగా చిల్లర బిహేవియర్ తో కనిపించేది. హౌస్ మేట్స్ అందరితో చాలా రూడ్ గా బిహేవ్ చేసింది. ఆమె మెగా చీఫ్ అయిన వీక్లో అయితే హౌస్ మేట్స్ అందరి చేత వ్యతిరేఖత ఎదుర్కొంది.
ఆమె కిచన్ డిపార్ట్మెంట్ లో పెర్ఫెక్ట్ గా పని చేసినా ఆమె బిహేవియర్ కి, ఆమె మాట్లాడే విధానానికి హౌస్ మేట్స్ చాలా హార్ట్ అయ్యేవారు. ఇక ఎలాగో టాస్క్ ల పరంగా టాప్5 లోకి వచ్చేసిన ప్రేరణ తన ప్రోమో చూసుకుని తానే సిగ్గుపడింది. హౌస్ లో టాప్ 5 కంటెస్టెంట్స్ ప్రోమోస్ వచ్చాయి.
తాజాగా ప్రేరణ ప్రోమో వెయ్యగా ఆమె ని నాగార్జున తిట్టిన ఎపిసోడ్, అలాగే టాస్క్ ల్లో నోరు పారేసుకున్న సందర్భాలు చూసి ప్రేరణ తల వంచుకుని బిక్కమొహం వేసింది. ఇకపై తనను తాను మార్చుకుంటాను అని చెప్పింది. జర్నీ ప్రోమోస్ చూసి అందరూ ఎమోషనల్ అయితే ప్రేరణ మాత్రం తన బిహేవియర్ కి తానే సిగ్గుపడింది.