ఫుడ్ ముట్టుకోకుండా నీళ్ళు తాగి.. నేలపై పడుకొని!
అల్లు అర్జున్.. అల్లు అర్జున్ అటు మీడియాలో, ఇటు సోషల్ మీడియాలో.. ఇక జనాలు సైతం ఎక్కడ చూసినా చర్చించుకుంటున్న పరిస్థితి. ముఖ్యంగా ఒక్క రోజు జైలు జీవితం గడపడంతో ఎలా ఉన్నాడో అభిమానులు, సినీ ప్రియులు సైతం చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే నిన్న చంచల్ గూడ జైలుకు తరలించినప్పటి నుంచీ రిలీజ్ వరకూ జైలులో ఏం చేశాడు..? ఆయన ఈ బ్యారక్ లో ఉన్నాడు..? ఆయనతో ఎవరైనా ఖైదీలు ఉన్నారా..? ఒక్కడే ఉన్నాడా..? అని తెలుసుకోవడానికి ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు. ఇదిగో ఇంకెందుకు ఆలస్యం Cinejosh.Com మీకోసం ఎక్స్ క్లూజివ్ సమాచారం అందిస్తోంది చదివేయండి మరి.
బెయిల్ వచ్చినా..!
అల్లు అర్జున్ జైలుకు ఒక సాధారణ ఖైదీగా మంజీర బ్యారక్ లో ఉన్నాడు. ఇది క్లాస్ వన్ ఖైదీలను ఉంచే రెగ్యులర్ బ్యారక్. మరో ఇద్దరు ఖైదీలతో పడుకున్న అల్లు అర్జున్ నిన్నటి నుంచి రిలీజ్ అయ్యే వరకూ ఇద్దరితోనే కలిసి ఉన్నాడు. నిన్ననే బెయిల్ రావడంతో బయటికి వెళ్లిపోవచ్చని భావించిన, ఎందుకో తెలియదు కానీ, రాత్రి అంతా జైలు జీవితం గడపాల్సి వచ్చింది. పుష్పను చూసేందుకు భారీగా ఖైదీలు ఎగబడ్డారు. ఐతే సెక్యూరిటీ సమస్యలతో ఏ ఒక్కరినీ జైలు సిబ్బంది కలవనివ్వలేదు.
నీళ్ళు తాగి.. నేలపైనే!
ఐతే క్లాస్ వన్ ఖైదీలకు ఇచ్చే సౌకర్యం ఉన్నా, నేలపైనే అల్లు అర్జున్ పడుకున్నాడు. నేలపైన పరుచుకోవడానికి చద్దరు, కప్పుకోవడానికి దుప్పటి ఇవ్వడంతో నేలపైనే పడుకున్నాడు. జైలు సిబ్బంది ఆహారం ఇచ్చినప్పటికీ పుష్ప మాత్రం ఆ ఆహారం అస్సలు ముట్టుకోలేదు. కేవలం నీళ్లు మాత్రమే తాగి పడుకున్నట్లు జైలు అధికారులు చెబుతున్నారు. ఉదయం 6 గంటలకు నిద్రలేపి బెయిల్ ఆర్డర్ వచ్చిందని అధికారులు చెప్పారు. దీంతో నిద్ర లేచిన అల్లు అర్జున్ నేరుగా అందరికీ అభివాదం చేస్తూ బయటికి వచ్చేశాడు. అడుగడుగునా అందలం, కోట్ల రూపాయల ఆస్తి ఉన్నా.. చట్టానికి ఎవరైనా ఒక్కటేనని జైలు ఖైదీలు, సిబ్బంది గుస గుసలు వినిపిస్తున్నాయి.