సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట లో ఓ మహిళ మృతి చెందిన కేసులో నిన్న శుక్రవారం ఉదయం పుష్ప2 హీరో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీస్ లు అరెస్ట్ చేసారు. నాంపల్లి కోర్టు ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించినా తెలంగాణ హై కోర్టు అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో ఒక నైట్ చెంచల్ గూడా జైలులో ఉన్న అల్లు అర్జున్ ఈరోజు ఉదయమే జైలు నుంచి బయటికి వచ్చారు.
ఇక నిన్న అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పటినుంచే ఆయన దగ్గరకు దిల్ రాజు, నాగవంశీ, మైత్రి మూవీ మేకర్స్, త్రివిక్రమ్ ఇలా చాలామంది వెళ్లారు. ఇంటి దగ్గరకు మెగా ఫ్యామిలోని ప్రతి ఒక్కరూ వెళ్లారు. ఈరోజు అల్లు అర్జున్ జైలు నుంచి ఇంటికొచ్చాక కూడా ఆయనకు వరసగా పరామర్శల పరంపర కొనసాగుతుంది.
అల్లు ఇంటికి విజయ్ దేవరకొండ దగ్గర నుంచి, నాగ చైతన్య, సుధీర్ బాబు, రానా వరకు, సుకుమార్ దగ్గర నుంచి వంశి పైడిపల్లి వరకు ఇలా అందరూ వచ్చి ఆయన్ను పలకరించి పరామర్శించి వెళుతున్నారు.
ప్రభాస్, తారక్ లు షూటింగ్స్ తో బిజిగా ఉండడంతో వారు అల్లు అర్జున్ ను ఫోన్ లోనే పరామర్శించనున్నట్లుగా వారి పీఆర్ టీమ్స్ తెలియజేశాయి.