బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలే షూట్ మొదలైపోయింది. కింగ్ నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ షూట్ ని యాజమాన్యం స్టార్ చేసింది. టాప్ 5 లో నిఖిల్, గౌతమ్, ప్రేరణ, నబీల్, అవినాష్ ఉన్నారు. ఈరోజు శనివారం ఎపిసోడ్ లో యాంకర్ సుమ వచ్చి టాప్ 5 కంటెస్టెంట్స్ తో సందడి చేసింది. అంతేకాదు ఇప్పటికే లైవ్ ఆపేసారు. ఇక రేపటి ఎపిసోడ్ షూట్ మొదలైంది.
అందులో భాగంగా టాప్ 5 నుంచి ఇద్దరు కంటెస్టెంట్స్ అవుట్ అయ్యి గ్యాలరీ లో కూర్చున్నారు అని బిగ్ బాస్ లీకులు వినిపిస్తున్నాయి. అందులో ముందుగా అవినాష్ ఐదో స్తానం నుంచి ఎలిమినేట్ అవ్వగా.. ప్రేరణ నాలుగో స్థానంలో టాప్ 5 నుంచి అవుట్ అయినట్లుగా తెలుస్తోంది. అవినాష్ కామెడీ చేసినా, టాస్క్ ల విషయంలో వీక్ అయ్యాడు.
ఇక ప్రేరణ కూడా సివంగిలా అబ్బాయిలకు పోటీ ఇచ్చినా నోటి దూల ఆమెను టాప్ 3 లో లేకుండా ముందే ఎలిమినేట్ అయ్యేలా చేసింది. ఇంకా టాప్ 3 లో నిఖిల్, గౌతమ్, నబీల్ ఉన్నారు. అందులో నబీల్ టాప్ 3 నుంచి బయటికొచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. అది కూడా కాసేపట్లో లీకుల ద్వారా రివీల్ అవుతుందిలెండి. కాస్త ఓపిక పడితే సరిపోతుంది.