Advertisementt

ఒకేసారి 3 ఛాన్సులు-లక్కీ హీరోయిన్

Mon 16th Dec 2024 06:03 PM
sreeleela  ఒకేసారి 3 ఛాన్సులు-లక్కీ హీరోయిన్
3 chances at once-lucky heroine ఒకేసారి 3 ఛాన్సులు-లక్కీ హీరోయిన్
Advertisement
Ads by CJ

ఒక హీరోయిన్ కి వరసగా డిజాస్టర్స్ ఉన్న సమయంలో మళ్ళీ యంగ్ హీరోలు ఆ హీరోయిన్ ని కన్సిడర్ చేస్తూ వరసగా ఛాన్స్ లు ఇస్తే ఆమెను లక్కీ అనే అనాలి. గతంలో అంటే ధమాకా తర్వాత వరసగా రామ్, నితిన్, వైష్ణవ్ తేజ్, మహేష్ ఇలా క్రేజీ హీరోలతో ఆడిపాడిన శ్రీలీల కి ఆ హీరోలంతా హ్యాండ్ ఇచ్చారు, ఆమెకి ఒకే తరహా పాత్రలిచ్చి డిజప్పాయింట్ చేసారు. 

గుంటూరు కారం తర్వాత డల్ అయిన శ్రీలీల మళ్ళి వరస ఆఫర్స్ తో కెరటంలా లేచింది. రవితేజ, నితిన్ సినిమాలే కాదు కిస్ కిస్సిక్ అంటూ పుష్ప 2 తో పాన్ ఇండియా వైడ్ గా పాపులర్ అయ్యింది. ఇప్పుడు వరస ఛాన్స్ లు పట్టేసి అదరగొట్టేసింది. మరోసారి యంగ్ హీరోల దృష్టి ఈ కిస్సిక్ బ్యూటీపై పడింది. 

ఇప్పటికే నాగ చైతన్య-కార్తీక్ దండు చిత్రంలో హీరోయిన్ గా ఫైనల్ అయిన శ్రీలీల కు మరో యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ తన సినిమాలో అవకాశం ఇచ్చాడట. అదే క్రేజీ అనుకుంటే ఇప్పుడు అక్కినేని కుర్ర హీరో అఖిల్ పక్కన హీరోయిన్ గా ఎంపికైంది అనే వార్త వైరలయ్యింది. వినరో భాగ్యము విష్ణు కథ దర్శకుడితో అఖిల్ చెయ్యబోయే సినిమాలో శ్రీలీలనే హీరోయిన్ అంటున్నారు. 

మరి ఒకేసారి ఇలా మూడు ఛాన్స్ రావడం మామూలు అదృష్టం కాదు కదా.. అందుకే శ్రీలీల అదృష్టాన్ని పొగడకుండా ఉండలేకపోతున్నారు అభిమానులు. 

3 chances at once-lucky heroine:

Busiest beauty Sreeleela striking big in Tollywood

Tags:   SREELEELA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ