మంచు ఫ్యామిలీ ఆస్తి గొడవ ప్రస్తుతం సీరియల్ మాదిరిగా మారిపోయింది. రోజుకో రకమైన గొడవతో మీడియాకి ఎక్కుతున్నారు. మోహన్ బాబు ని తోశారంటూ ఆయన మంచు మనోజ్ పై కేసు పెడితే మోహన్ బాబే నన్ను తోశారంటూ మంచు మనోజ్ కేసు పెట్టడమే కాదు.. ఈగొడవలో భాగంగా మోహన్ బాబు రిపోర్టర్ పై చేయి చేసుకుంటే అది కూడా కేసయ్యింది. ఇక మోహన్ బాబు తన గన్ ను పోలీసులకు సరెండర్ చేసారు.
ఈలోపులో మంచు విష్ణు తన ఇంటి జెనరేటర్ లో పంచదార పోసాడు, తన తల్లిని, తన కుమర్తెను చంపడానికి విష్ణు తన మనుషులతో ప్రయత్నం చేస్తున్నాడు అంటూ పహాడీ ష్రఫ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసాడు. ఇక నిన్న అత్త శోభానాగిరెడ్డి జయంతి సందర్భంగా భార్య మౌనిక తో బిడ్డ దేవసేన తో సహా నంద్యాల వెళ్ళాడు మనోజ్.
ఈలోపులో మంచు మనోజ్ తల్లి, విష్ణు స్టెప్ మదర్ నిర్మల దేవి తన పెద్ద కొడుకు తనకు బర్త్ డే విషెస్ చెప్పి కేక్ కట్ చేయించడానికి తన ఇంటికి వచ్చాడు. మేమంతా సెలెబ్రేట్ చేసుకున్నాము, అంతేకాని విష్ణు మనోజ్ జెనరేటర్ లో పంచదార పోసాడు అనే విషయంలో నిజం లేదు, విష్ణు మనుషులతో గొడవ చేసాడు అనేది కూడా అబద్దమే, విష్ణు నా దగ్గరకు వచ్చిన వీడియో ఫుటేజ్ బయటపెట్టి మనోజ్ కేసు పెట్టాడు.
ఇంట్లో పని చేసే మనుషులు కూడా మేము మనోజ్ ఇంట్లో పని చేయలేమని వెళ్లిపోయారు, అందులోను విష్ణు ప్రమేయం లేదు అంటూ పహడి ష్రఫ్ పోలీస్ స్టేషన్ కి మంచు నిర్మల దేవి లేఖ రాయడం చూసి తలి నిర్మలాదేవి కూడా మంచు విష్ణు కి సపోర్ట్ చేస్తుంది అంటూ మాట్లాడుకుంటున్నారు.