మంచు ఫ్యామిలీలో వివాదాలు రోజురోజుకు పెరుగుతున్నాయే తప్ప ఏమాత్రం తగ్గే పరిస్థితులు అస్సలు కనిపించడం లేదు. బహుశా మంచు మోహన్ బాబు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నాటి నుంచి తొలిసారి ఈ రేంజిలో కుటుంబం వార్తల్లో నిలవడం తొలిసారి ఏమో! నిన్న మొన్నటి వరకూ నాన్న వర్సెస్ కొడుకు.. అన్న వర్సెస్ తమ్ముడుగా పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు సీన్ లోకి మంచు నిర్మల కూడా ఎంట్రీ ఇచ్చేశారు. నిర్మల పుట్టిన రోజు సందర్భంగా జనరేటర్ లో చక్కెర పోశారంటూ పెద్ద రచ్చే అయ్యింది. దీంతో పహాడి షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి మనోజ్ సిద్ధమయ్యాడు.
రంగంలోకి దిగిన నిర్మల!
మంచు వివాదంలో ఇంత వరకూ ఎక్కడా కనిపించని నిర్మల పేరు మాత్రమే బాగానే వినిపించింది. ఐతే పుట్టిన రోజు ఏం జరిగింది..? మంచు మనోజ్ చెబుతున్న మాటల్లో నిజమెంత? అనేదానిపై స్పందించారు. అంతే కాదు కొడుకుపై పహాడి షరీఫ్ పోలీసులకు కూడా ఫిర్యాదు కూడా చేశారు. మంచు మనోజ్ కావాలనే తప్పు ప్రచారం చేస్తున్నాడు. నా పుట్టిన రోజు సందర్భంగా శనివారం మంచు విష్ణు ఇంటికి వచ్చాడు. కేక్ తీసుకువచ్చి కట్ చేయించాడు. ఇంట్లో జనరేటరులో షుగర్ పోశారని మనోజ్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని నిర్మల చెప్పుకొచ్చారు.
హక్కు ఉందిగా..
విష్ణు గొడవ చేశాడని లేనిపోని అభాండాలు మోపి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఇంట్లో మంచు మనోజ్ కు ఎంత హక్కు ఉందో మంచు విష్ణుకు పెద్ద కొడుకుగా అంతే హక్కు ఉంది. మంచు విష్ణు దౌర్జన్యంతో ఇంట్లోకి రాలేదు. అదంతా మనోజ్ తప్పుడు ప్రచారమే. ఇంట్లో పనివాళ్లు మానేయడానికి విష్ణు కారణం కాదు.
నా పెద్ద కొడుకు అయిన విష్ణు ఎటువంటి దౌర్జన్యంతో కానీ, మనుషులతో కానీ ఇంట్లోకి రాలేదు, గొడవ చేయలేదు. మనోజ్ కంప్లయింట్ చేసిన దానిలో నిజం లేదని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో నిర్మల పేర్కొన్నారు.
అంతకు మించి ఏం లేదు!
ఈ ఇంట్లో పని వాళ్ళు కూడా మేమిక్కడ పని చేయలేమని, వాళ్ళే మానేసారు. ఇందులో విష్ణు ప్రమేయం ఎంతమాత్రం లేదు. విష్ణు మా జల్ పల్లి ఇంటికి వచ్చాడు, నా పుట్టిన రోజు సెలబ్రేట్ చేశాడు, విష్ణు గదిలో వున్న తన సామాను తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు, అంతకు మించి ఇక్కడ జరిగింది ఏమీ లేదని మంచు నిర్మల మోహన్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనలో పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు..? ఎలా ముందుకు ఎలా వెళతారు అనేది చూడాలి మరి.