ఇండియన్ 2 తర్వాత కాజల్ అగర్వాల్ అంతగా కనిపించింది లేదు. సెకండ్ ఇన్నింగ్స్ లో బిజీ అయ్యేందుకు తరచూ సోషల్ మీడియాలో కొత్త ఫోటో షూట్స్ ని షేర్ చేసేందుకు తహతహలాడే కాజల్ అగర్వాల్ ఈ మధ్యన ఫ్యామిలీకి టైమ్ కేటాయించి సోషల్ మీడియాలో కనిపించడం తగ్గించింది.
లేదంటే ఇప్పటికి గ్లామర్ ఫొటోస్ తో దర్శకనిర్మాతల దృష్టిలో పడేందుకు తన ప్రయత్నాలు చేస్తుంది. చందమామ గా ఇండస్ట్రీ హిట్స్ లో నటించిన కాజల్ అగర్వాల్ కి సెకండ్ ఇన్నింగ్ లో భగవంత్ కేసరి హిట్ తప్ప మరో హిట్ పడలేదు. ఆ సక్సెస్ కూడా బాలయ్య-శ్రీలీల ఖాతాల్లోకి వెళ్ళిపోయింది తప్ప కాజల్ ని ఎవరు గుర్తించలేదు. ప్రస్తుతం సీనియర్ హీరోల అవకాశాల కోసం కాజల్ వెయిట్ చేస్తుంది.
తాజాగా కాజల్ అగర్వాల్ నుంచి ఓ పిక్ సోషల్ మీడియాకి చేరగానే చాలా రోజుల తర్వాత చందమామ దర్శనం అంటూ ఆమె అభిమానులు కామెంట్ చేస్తున్నారు.