Advertisementt

రైతు బిడ్డ కాదు రాయల్ బిడ్డ

Sat 21st Dec 2024 05:31 PM
pallavi prashanth  రైతు బిడ్డ కాదు రాయల్ బిడ్డ
Pallavi Prashanth Royal Avatar రైతు బిడ్డ కాదు రాయల్ బిడ్డ
Advertisement
Ads by CJ

గత ఏడాది బిగ్ బాస్ సీజన్ 7 లో రైతు బిడ్డ అంటూ కప్ కోసం బిగ్ బాస్ హౌస్‌లో కలరింగ్ ఇస్తూ ఆ సింపతితో గెలిస్తే తనకొచ్చే ప్రైజ్ మనీని రైతుల కోసం త్యాగం చేస్తాను అంటూ ఫైనల్ గా బిగ్ బాస్ సీజన్ 7 ట్రోఫి గెలిచి కప్ అందుకున్నాడు. బిగ్ బాస్ నుంచి బయటికొచ్చి విజేతగా ఓవరేక్షన్ చేసి పోలీస్‌లనే ఇరికించే ప్రయత్నం చేసిన పల్లవి ప్రశాంత్‌ని చెంచల్ గూడా జైల్లో పడేశారు. 

పోలీసులకి దొరక్కుండా రెండు రోజులు డ్రామాలు చేసిన పల్లవి ప్రశాంత్‌ని పోలీసులు ఓ రెండురోజులు జైలులో ఉంచారు. ఆ తర్వాత పల్లవి ప్రశాంత్  రైతుల కోసం ఏమైనా చేయడానికి నేనేమైనా సీఎం నా అంటూ అతి చేశాడు. హౌస్ లో ఉన్నప్పుడు తనకొచ్చిన ప్రైజ్ మనీ మొత్తం రైతుల కోసం ఖర్చు పెడతా అన్నాడు, కానీ ఒకటి రెండు లక్షలు ఖర్చు పెట్టి సైలెంట్ అయ్యాడు. ఏడాది కాలంగా రైతు బిడ్డగానే ఫోజ్ కొట్టిన పల్లవి ప్రశాంత్ తాజాగా మోడ్రెన్ అవతారమెత్తి ఫోటో షూట్ చేయించుకున్నాడు. 

ఆ ఫొటోస్ చూసి ఇతను రైతు బిడ్డా కాదు కాదు రాయల్ బిడ్డ అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు, హౌస్ లో ఉన్నప్పుడు రైతు బిడ్డను బ్రతకనివ్వరా అంటూ కప్ పట్టుకుపోయి, ప్రైజ్ మనీ ఎవ్వరికి పంచకుండా దాచేసుకున్న పల్లవి ప్రశాంత్ కొత్త ఫోటో షూట్ చూసి నెటిజెన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.

Pallavi Prashanth Royal Avatar:

Bigg Boss Winner Pallavi Prashanth Modern Makeover    

Tags:   PALLAVI PRASHANTH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ