మిస్టర్ బచ్చన్ తో తెలుగులోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సేకి ఆ సినిమా రిజల్ట్ పెద్ద షాకే ఇచ్చింది. అయినప్పటికీ ఈ గ్లామర్ డాల్ కి తెలుగు దర్శకనిర్మాతలు క్రేజీ ఆఫర్స్ ఇవ్వడం పై హాట్ హాట్ గా చర్చ జరుగుతుంది. దుల్కర్ సల్మాన్, రామ్ లాంటి క్రేజీ హీరోలతో భాగ్యశ్రీ బోర్సే జత కడుతోంది.
తాజాగా భాగ్యశ్రీ బోర్సే 2024 ఏడాది ఎండ్ అవడంపై ఎమోషనల్ గా పోస్ట్ పెట్టింది. తన ఇన్స్టా స్టోరీస్ లో 2024కి ఇంత త్వరగా ఎండ్ కార్డ్ పడుతుందంటే నమ్మలేకపోతున్నా, కొత్త ప్రారంభంతో కొత్త ఏడాది మన ముందుకు రాబోతోంది, ఈఏడాది లో నేను నవ్వాను, ఏడ్చాను, ఎన్నో కలలు కన్నాను.. అంతేకాదు కష్టాలు కూడా చూశాను.
కానీ నేను మీకు చెప్పేది ఒక్కటే.. మీ అందరికీ నేను కృతజ్ఞురాలిని అంటూ భాగ్యశ్రీ ఎమోషనల్ గా పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.