సఖ్యత సరిగ్గా ఉన్నప్పుడు బంధాలు బలంగా ఉంటాయి. అది కోల్పోతే బలహీనంగా మారుతాయి. అది ఇద్దరి స్నేహితుల మధ్య కావొచ్చు. కుటుంబంలో కావొచ్చు. సినిమా స్టార్ల మధ్య కావొచ్చు. ఇటీవల ఓ ఇద్దరు సూపర్‌స్టార్ల మధ్య అలాంటి సమస్య సినీపొలిటికల్ కారిడార్‌లో చర్చగా మారింది. పొలిటికల్ వార్ కాస్తా స్టార్ల మధ్య వార్ గా మారింది. ఆ ఇద్దరు స్టార్ హీరోలు ఎవరు? అంటే వివరాల్లోకి వెళ్లాలి.
సూపర్ స్టార్ రజనీకాంత్- దళపతి విజయ్ మధ్య రాజకీయంగా చిన్నపాటి పొరపొచ్చాలు ఉన్న సంగతి తెలిసిందే. విరుద్ధ పాలసీల కారణంగా ఆ ఇద్దరు హీరోల అభిమానుల మధ్యా కొంత ఘర్షణ వాతావరణం అలుముకుంది. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ అధికార పక్షంపై దూకుడుగా విమర్శలు గుప్పిస్తున్నాడు. ఇటీవల ఈ విషయంలో కొంత హద్దు మీరాడనే ఆరోపణలున్నాయి. దీనిని బ్యాలెన్స్ చేసేందుకు అధికార పక్షానికి (స్టాలిన్‌కి) మద్ధతుగా రజినీకాంత్ బరిలో దిగారని టాక్ వినిపించింది. విజయ్ హద్దు మీరి మాట్లాడుతున్నందున అతడికి రజనీ ముకుతాడు వేసాడనే చర్చా సాగింది. దీనికి ప్రతిగా విజయ్ కౌంటర్ వేస్తాడని అనుకున్నారంతా. కానీ ఆ సమయంలో దళపతి తెలివిగా మౌనం వహించాడు. కానీ ఇద్దరు హీరోల అభిమానుల మధ్య సోషల్ మీడియాలో పెను యుద్ధం మొదలైంది. అభిమాన సంఘాల మధ్య దూషణల ఫర్వం వేడెక్కించింది.
ఇదే విరోధం ఇప్పుడు ఇండస్ట్రీలో సరికొత్త వార్ గా రూపాంతరం చెందుతోందని కోలీవుడ్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దళపతి విజయ్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం జననాయగన్ విడుదలను అడ్డుకోవాలని ప్రత్యర్ది వర్గం కుయుక్తులు పన్నుతోందనే గుసగుస వినిపిస్తోంది. జననాయగన్ చిత్రాన్ని వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 9 రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మేకర్స్ అధికారికంగా తేదీ కూడా ప్రకటించారు. కానీ ఈ మూవీని పొంగల్ రేసు నుంచి తప్పించాలని ఇండస్ట్రీలో కుట్ర జరుగుతోందని గుసగుస వినిపిస్తోంది. 2026 సంక్రాంతి బరిలోనే రజనీకాంత్ నటిస్తున్న జైలర్-2`ని రిలీజ్ చేసేలా సన్నాహాలు చేస్తున్నారుట. `జైలర్ 2 కి మద్దతుగా అధికార పార్టీ నాయకులు ఇండస్ట్రీ వర్గాలను ప్రభావితం చేస్తున్నారని గుసగుస వినిపిస్తోంది. అంతేకాదు.. హీరో విజయ్ కి తెలియనీకుండా, జననాయగన్ నిర్మాతలతో సీక్రెట్ గా రాయబేరాలు నడుపుతున్నారుట.
కోలీవుడ్ లో ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రిలీజ్ సినిమాలపై పెత్తనం చెలాయిస్తోందని ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. సదరు పంపిణీ సంస్థ చాలా సినిమాల రిలీజ్ కు ఆటంకాలు సృష్టించిందని పలువురు గతంలో లబోదిబో మన్నారు. జన నాయగన్ విషయంలోను ఇదే జరగబోతోందని గుసగుస వినిపిస్తోంది. నిజానికి రాజకీయంగా ఎలా ఉన్నా కానీ, సినీ తారలు ఇండస్ట్రీలలో ఒకటిగా ఉన్నారు. కానీ విజయ్ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి దిగారు కాబట్టి అతడిపై ప్రత్యర్థుల కుయుక్తులు పీక్స్ కి చేరుకుంటున్నాయని గుసగుస వినిపిస్తోంది. విజయ్ ని ఆర్థికంగా మానసికంగా దెబ్బ కొట్టాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్ వినిపిస్తోంది సినిమా వేరు..రాజకీయం వేరు అని ఈ సన్నివేశం నిరూపిస్తోంది.