Advertisementt

బావమరిది కోసం NTR రాక

Fri 04th Apr 2025 11:53 AM
ntr  బావమరిది కోసం NTR రాక
NTR grace to Mad Square success celebrations బావమరిది కోసం NTR రాక
Advertisement
Ads by CJ

మ్యాడ్ చిత్రం అప్పుడు బావమరిది నార్నె నితిన్ కోసం ట్రైలర్ లాంచ్ చేసి ఆ చిత్రాన్ని సపోర్ట్ చేసారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. నిర్మాత నాగవంశీ కూడా ఎన్టీఆర్ తో స్నేహం ఉన్నవాడు కావడంతో అపుడు ఎన్టీఆర్ మ్యాడ్ కి సపోర్ట్ చేశారు. మ్యాడ్ స్క్వేర్ కి వచ్చేసరికి నార్నె నితిన్ కానీ, నాగవంశీ కానీ ఎన్టీఆర్ వద్దకు వెళ్ళలేదు. 

ఎన్టీఆర్ కూడా దేవర ప్రమోషన్స్ తో జపాన్ ట్రిప్ లో ఉండడంతో మ్యాడ్ స్క్వేర్ యూనిట్ కూడా ఆయన్ని కదిలించలేదు. ఇప్పుడు సినిమా విడుదలై మంచి హిట్ అవడంతో సక్సెస్ సెలెబ్రేషన్స్ ప్లాన్ చేసింది యూనిట్. ఈ సక్సెస్ సెలెబ్రేషన్స్ కి ఎన్టీఆర్ ని గెస్ట్ గా పిలిచారు. ఈ రోజు ఏప్రిల్ 4 న హైదరాబాద్ శిల్ప కళావేదికలో జరగనున్న మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ సెలెబ్రేషన్స్ లో ఎన్టీఆర్ తన బావమరిది నార్నె నితిన్ కోసం నిలబడుతున్నారు. 

మరి ఎన్టీఆర్ తాన్ బావమరిది నార్నె నితిన్ పిలిస్తే రాకుండా ఉండరు. మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ సెలెబ్రేషన్స్ లో ఎన్టీఆర్ గెస్ట్ గా వస్తే బావమరిదిగా నార్నె నితిన్ కి ఎన్టీఆర్ సపోర్ట్ మాములుగా ఉండదు, మరోపక్క ఎన్టీఆర్ తన అన్న కళ్యాణ్ రామ్ లేటెస్ట్ చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ప్రమోషన్స్ కి కూడా రాబోతున్నట్లుగా తెలుస్తోంది. 

NTR grace to Mad Square success celebrations:

NTR attends Mad Square Grand Success Bash

Tags:   NTR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ