రామ్ చరణ్ మార్చ్ 26 న తన 40 వ బర్త్ డే వేడుకలను చాలా గ్రాండ్ గా చేసుకున్నారు, భార్య ఉపాసన భర్త చరణ్ కోసం అదిరిపోయే పార్టీని ఎరేంజ్ చేసి రామ్ చరణ్ స్నేహితులను పిలిచి మరీ భర్త కు సర్ ప్రైజ్ ఇచ్చింది. అయితే రామ్ చరణ్ తన బర్త్ డే కి పెద్ది సినిమా దర్శకుడు బుచ్చిబాబు కోసం భార్య ఉపాసన తో కలిసి బహుమతిని పంపించారు.
అంతేకాదు ఆ గిఫ్ట్ తో పాటుగా ఓ లెటర్ కూడా బుచ్చి బాబు కి చేరింది. డియర్ బుచ్చి హనుమాన్ చాలీసా నాకు జీవితంలో అత్యంత విలువైనదే కాదు, నాకు గొప్ప శక్తిని ఇచ్చింది. క్లిష్ట సమయాల్లో సైతం హనుమాన్ పై నాకున్న నమ్మకం నన్ను నిలబెట్టింది. నేను 40వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఆ హనుమాన్ శక్తిలో కొంత నీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా.
నా లైఫ్ లో నీకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎప్పుడూ బాగుండాలి. దేవుడి దీవెనలు నీకు ఉండాలి. ఇది కేవలం బహుమతి మాత్రమే కాదు. నీ మీద మాకున్న ప్రేమను చాటుతుంది అంటూ చరణ్, ఉపాసనలు ఆ లెటర్ లో రాసారు.
ఆ బహుమతి అందుకున్న బుచ్చిబాబు ఆ గిఫ్ట్ ని షేర్ చేస్తూ రామ్ చరణ్ దంపతులకు మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా సోషల్ మీడియా ద్వారా కృతఙ్ఞతలు తెలియజేసాడు.