Advertisementt

అమ్మాయిల‌తో దొరికిపోయిన స్టార్ హీరో

Fri 04th Apr 2025 03:13 PM
hero  అమ్మాయిల‌తో దొరికిపోయిన స్టార్ హీరో
Star hero caught with girls అమ్మాయిల‌తో దొరికిపోయిన స్టార్ హీరో
Advertisement
Ads by CJ

విదేశాల నుంచి అక్రమంగా త‌ర‌లించిన ఐదుగురు అమ్మాయిల‌తో ప్ర‌ముఖ హీరో శృంగారంలో పాల్గొన్నాడు. ఆ అయిదుగురిని ఒక క్రిమిన‌ల్ గ్రూప్ అత‌డికి సప్ల‌య్ చేసింది. క్రిమిన‌ల్స్ తో అంట‌కాగిన ప‌ర్య‌వ‌సానం.. ఇప్పుడు స‌ద‌రు స్టార్ హీరో అనుభ‌విస్తున్నాడు. అత‌డిని క‌ట‌క‌టాల్లోకి పంపేందుకు పోలీసులు స‌న్నాహ‌కాల్లో ఉన్నారు. ప్ర‌స్తుతం కేసు న‌మోదు చేసిన అధికారులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఈ ద‌ర్యాప్తు వివ‌రాల ప్ర‌కారం...

ప్ర‌ముఖ హాలీవుడ్ నటుడు జీన్-క్లాడ్ వాన్ డామ్ విదేశాల నుంచి అక్ర‌మంగా త‌ర‌లించిన‌ ఐదుగురు రొమేనియన్ మహిళలతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడని ఆరోపణలు వచ్చాయి. రొమేనియాలో అత‌డిపై ప‌లు క్రిమినల్ అభియోగాలు నమోదయ్యాయని తెలుస్తోంది. సీఎన్ఎన్ అనుబంధ సంస్థ యాంటెనా 3 క‌థ‌నం ప్రకారం.. మోరెల్ బోలియా నేతృత్వంలోని క్రిమినల్ గ్రూప్ మహిళలను అక్ర‌మంగా విదేశాల నుంచి త‌ర‌లిస్తుంది. వీరిని చ‌ట్ట‌వ్య‌తిరేక చ‌ర్య‌ల‌కు వినియోగించి డ‌బ్బు సంపాదిస్తుంది. అలాంటి క్రిమిన‌ల్ గ్రూప్ తో  64 ఏళ్ల వివాహితుడైన‌ హాలీవుడ్ స్టార్ వాన్ డ‌మ్ సంబంధాలు పెట్టుకున్నాడు. అయితే అత‌డిపై రొమేనియన్ డైరెక్టరేట్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ టెర్రరిజం (DIICOT)కి క్రిమినల్ ఫిర్యాదు అందింది. 

రొమేనియన్ వ్యాపారవేత్త - మోడలింగ్ ఏజెన్సీ యజమాని మోరెల్ బోలియా నేతృత్వంలోని క్రిమినల్ గ్రూప్  ఈ ఐదుగురు మహిళలను అత‌డి వ‌ద్ద‌కు పంపింది. ఈ ముఠా స‌భ్యులు వాన్ డ‌మ్ కి `బహుమతి`గా ఈ అమ్మాయిల‌ను పంపించార‌ని తెలుస్తోంది. కేన్స్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో వాన్ డ‌మ్ కి ఈ మ‌హిళ‌ల‌ను స‌ర‌ఫ‌రా చేసారు. క్రిమిన‌ల్ గ్రూప్ ల‌పై పోలీసులు ఆరాలు తీస్తున్న క్ర‌మంలో ఈ నిజం బ‌య‌ట‌ప‌డింది. 

కిక్‌బాక్సర్, డబుల్ ఇంపాక్ట్, స్ట్రీట్ ఫైటర్ , డబుల్ టీమ్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌లో వాన్ డ‌మ్ న‌టించాడు. భార‌తీయ న‌టి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తో క‌లిసి అత‌డు కిల్ ఎమ్ ఆల్ 2 అనే చిత్రంలో న‌టించాడు.

Star hero caught with girls:

Star hero booked for links with criminals

Tags:   HERO