Advertisementt

జాక్ ట్రైలర్ రొటీన్ అంటున్న యూత్

Fri 04th Apr 2025 05:49 PM
jack  జాక్ ట్రైలర్ రొటీన్ అంటున్న యూత్
Youth saying Jack trailer routine జాక్ ట్రైలర్ రొటీన్ అంటున్న యూత్
Advertisement
Ads by CJ

సిద్దు జొన్నలగడ్డ టిల్లు సీరీస్ తో యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ దక్కించుకున్న యంగ్ హీరో. సిద్దు జొన్నలగడ్డ ఇప్పుడు జాక్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. టిల్లు స్క్వేర్ తర్వాత సిద్దు క్రేజ్ బాగా పెరిగింది. టిల్లు తర్వాత అంతకు మించిన కంటెంట్ తో సిద్దు యూత్ ముందుకు వస్తాడని యూత్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. 

బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య తో కలిసి రొమాన్స్ చేస్తున్న సిద్దు జొన్నలగడ్డ జాక్ ప్రమోషన్స్ లో బిజీగా వున్నాడు. రీసెంట్ గానే సిద్దు జొన్నలగడ్డ జాక్ ట్రైలర్ విడుదలైంది. జాక్ ట్రైలర్ చూసిన యూత్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. జాక్ ట్రైలర్ పరమ రొటీన్ గా ఉంది అంటూ మాట్లాడుకుంటున్నారు, సిద్దు జొన్నలగడ్డ ని టిల్లు గా వేరే లెవల్లో చూసిన వారికి జాక్ కేరెక్టర్ అస్సలు ఎక్కదు, జాక్ లో సిద్దు కేరెక్టర్ కొత్తగా లేదు, పరమ రొటీన్. సిద్దు జొన్నలగడ్డ ముద్దులు, బూతులతోనే ఫేమస్ అవుదామనుకుంటున్నాడు. 

జాక్ డైలాగ్స్ బోరింగ్, సిద్దు రొటీన్ యాక్టింగ్, వైష్ణవి చైతన్య లుక్స్ బావున్నాయి, జాక్ ట్రైలర్ చూస్తే కథేమిటో ఈజీగా గెస్ చెయ్యొచ్చు, జాక్ లో సిద్దు జొన్నలగడ్డ లో ఎలాంటి స్పెషల్ కనిపించలేదు, జాక్ ట్రైలర్ నార్మల్ గా ఉంది అంటూ జాక్ ట్రైలర్ చూసిన వారు కామెంట్స్ పెడుతున్నారు. 

Youth saying Jack trailer routine:

Siddhu Jonnalagadda Jack Trailer public talk

Tags:   JACK