Advertisementt

పిఠాపురం పాలిటిక్స్ - నాగబాబు vs వర్మ

Fri 04th Apr 2025 07:19 PM
nagababu  పిఠాపురం పాలిటిక్స్ - నాగబాబు vs వర్మ
Pithapuram Politics - Nagababu vs Varma పిఠాపురం పాలిటిక్స్ - నాగబాబు vs వర్మ
Advertisement
Ads by CJ

పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కోసం సర్వం త్యాగం చేసి చివరికి ఎటు కాకుండా పోయిన వర్మ ఇప్పడు తన బలమేమిటో చూపించేందుకు రెడీ అవుతున్నారు. కారణం వర్మ ను అటు చంద్రబాబు, లోకేష్ పట్టించుకోకపోవడం, ఇటు పవన్ కళ్యాణ్ తనకు ఇచ్చే ప్రాధాన్యత తగ్గడం, కొత్తగా ఎమ్యెల్సీ అయిన నాగబాబు వర్మను పూచికపుల్లలా తీసెయ్యడం ఇవన్నీ వర్మ జీర్ణించుకోలేకపోతున్నారు. 

ఇప్పటికే పిఠాపురం ప్రజల్లోకి వెళుతున్న వర్మకు, నాగబాబు ఎమ్యెల్సీ గా ప్రమాణ స్వీకారం చేసి వేంటనే పిఠాపురంలో దిగిపోయి అడుగడుగునా అడ్డం పడుతున్నారు. అక్కడ ప్రజల మధ్యన అధికారిక కార్యకలాపాలలో పాల్గొంటున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు నాగబాబు శంకుస్థాపన చేస్తున్నారు. నాగబాబు ఎక్కడికొస్తే అక్కడ జనసేన కార్యకర్తలు నానా హంగామా చేస్తూ నాగబాబు కి జై కొడుతున్నారు. 

ప్రతీకగా వర్మ కోసం టీడీపీ అభిమానులు, కార్యకర్తలు జై టీడీపీ, జై వర్మ అంటూ నినాదాలు చేస్తున్నారు. నాగబాబు కార్యక్రమాల్లో వర్మ పిఠాపురం కి చేసిన అభివృద్ధి క్లిప్పింగ్స్ వేసి టీడీపీ వాళ్ళు హల్ చల్ చేస్తున్నారు. మరి నాగబాబుకు పిఠాపురంలో ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో ఇకపై వర్మ అడుగులు ఎలా ఉండబోతున్నాయో, వర్మ రాజకీయం ఎలా ఉండబోతుందో అనే ఉత్కంఠ అందరిలో మొదలైంది. 

Pithapuram Politics - Nagababu vs Varma :

 Nagababu vs Varma 

Tags:   NAGABABU