Advertisementt

రజినీకాంత్ జైలర్ 2 లోకి క్రేజీ యాక్టర్స్

Thu 29th May 2025 05:01 PM
jailer 2  రజినీకాంత్ జైలర్ 2 లోకి క్రేజీ యాక్టర్స్
Nagarjuna and Vidya Balan enters Rajini Coolie రజినీకాంత్ జైలర్ 2 లోకి క్రేజీ యాక్టర్స్
Advertisement
Ads by CJ

సూపర్ స్టార్ రజనీకాంత్ కి జైలర్ చిత్రంతో అద్దిరిపోయే పాన్ ఇండియా హిట్ ఇచ్చాడు దర్శకుడు నెల్సన్ కుమార్. ఆతర్వాత సూపర్ స్టార్ వరస సినిమాలను లైన్ లో పెట్టేసారు. ముఖ్యగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో కూలి చిత్రాన్ని ముగించారు. ఆతర్వాత నెల్సన్ దర్శకత్వంలో జైలర్ కి సీక్వెల్ గా మొదలైన జైలర్ 2 సెట్ పైకి వెళ్లిపోయారు రజినీకాంత్.

జైలర్ చిత్రంలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ లు గెస్ట్ రోల్స్ లో మెరిశారు. ఇప్పుడు  జైలర్ 2లో కి కొత్త కేరెక్టర్స్ ఎంటర్ అవుతున్నాయి. అందులో ముఖ్యంగా టాలీవుడ్ నుంచి నందమూరి బాలకృష్ణ పోలీస్ అధికారిగా ఎంటర్ కాబోతున్నారు. ఏపీ పోలీస్ ఆఫీసర్ గా బాలయ్య జైలర్ 2 లో కనిపిస్తారట. 

ఇప్పుడు రజినీకాంత్ జైలర్ 2లోకి బాలీవుడ్ హీరోయిన్ విద్య బాలన్ రాబోతున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాదు కింగ్ నాగార్జున జైలర్ 2 లో విలన్ గా కనిపిస్తారని తెలుస్తుంది. ఇప్పటికే ఆయన రజిని కూలీ లో కీ రోల్ చేస్తున్నారు. జైల‌ర్ 1లో ర‌జ‌నీ భార్య‌గా ర‌మ్య‌కృష్ణ క‌నిపించారు. మరి జైలర్ 2 లోకి రాబోతున్న విద్యాబాల‌న్ పాత్రేమిట‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

Nagarjuna and Vidya Balan enters Rajini Coolie:

Vidya Balan to star in Rajinikanth Jailer 2

Tags:   JAILER 2
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ