Advertisementt

మృణాల్ కి బాలీవుడ్ లో షాక్ మీద షాక్

Thu 07th Aug 2025 08:51 PM
mrunal  మృణాల్ కి బాలీవుడ్ లో షాక్ మీద షాక్
Son of Sardaar 2 shocks Mrunal Thakur మృణాల్ కి బాలీవుడ్ లో షాక్ మీద షాక్
Advertisement
Ads by CJ

హిందీ నటి మృణాల్ ఠాకూర్ కు బాలీవుడ్ లో అస్సలు కలిసి రావడంలేదు, సీరియల్స్ నుంచి సినిమాల్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్ కి బాలీవుడ్ లో షాక్ ల మీద షాక్ లే తగులుతున్నాయి. సౌత్ లో సీతారామం చిత్రంతో ఫేమస్ అయిన మృణాల్ ఠాకూర్ కు ఆ తర్వాత హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ చిత్రాలు కొద్దిపాటి షాకిచ్చాయి.

ఆపై మృణాల్ ఠాకూర్ మళ్లీ హిందీలో అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. మృణాల్ ఠాకూర్ నటించిన సన్ ఆఫ్ సర్ధార్ 2 రీసెంట్ గానే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అజయ్ దేవగణ్ హీరోగా నటించిన ఈ చిత్రం గత శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా విడుదలకు ముందు కూడా సినిమాపై ఎలాంటి హైప్ లేకపోవడంతో మినిమం ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోయింది. 

మరోపక్క ఈ సినిమాకొచ్చిన నెగెటివ్ టాక్ తో వీకెండ్ తో పాటుగా వీక్ డేస్ లోను థియేటర్స్ ఖాళీగా కనిపించడంతో సన్ ఆఫ్ సర్ధార్ 2 డిజాస్టర్ లిస్ట్ లోకి వెళ్ళిపోయింది. అలా మృణాల్ ఠాకూర్ కేరీర్లో మరో ప్లాప్ పడింది. ఆమెకి బాలీవుడ్ కలిసి రావడం లేదు అనే ప్రచారం మరోసారి నిజమైంది. మృణాల్ ప్రస్తుతం తెలుగులో అడివి శేష్ డెకాయిట్ లో నటిస్తుంది. 

Son of Sardaar 2 shocks Mrunal Thakur:

Son of Sardaar 2 result shocks Mrunal Thakur

Tags:   MRUNAL
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ