Advertisementt

ప్రముఖ టాలీవుడ్ నిర్మాతపై భూకబ్జా కేసు

Tue 11th Nov 2025 01:28 PM
bellamkonda suresh  ప్రముఖ టాలీవుడ్ నిర్మాతపై భూకబ్జా కేసు
Land grabbing case against prominent Tollywood producer ప్రముఖ టాలీవుడ్ నిర్మాతపై భూకబ్జా కేసు
Advertisement
Ads by CJ

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత బెల్లంకొండ సురేష్ పై భూకబ్జా కేసు నమోదు కావడం హాట్ టాపిక్ అయ్యింది. బెల్లంకొండ సురేష్ తన ఇంటిని ఆక్రమించుకున్నారంటూ శివ ప్రసాద్ ఆరోపణలు చెయ్యడమే కాదు శివ ప్రసాద్ ఆయనపై కేసు పెట్టారు. బెల్లంకొండ సురేష్ హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఫిలిం నగర్ రోడ్ నం.7లో శివప్రసాద్ ఇంటిని ఆక్రమించుకున్నట్లుగా ఆరోపిస్తున్నారు. 

కొంతకాలంలోగా ఫిలిం నగర్ లో నివాసముంటున్న శివ ప్రసాద్ తన ఇంటికి తాళం వేసి తన బంధువుల ఇంట్లో ఉంటున్నాడు. ఆ సమయంలోనే బెల్లంకొండ సురేష్ తన అనుచరులతో కలిసి శివప్రసాద్ ఇంటిని ఆక్రమించుకుని ఇంట్లోని వస్తువులను పగలగొట్టి గందరగోళం చేసారని శివప్రసాద్ ఆరోపిస్తున్నాడు. 

తాను ఇంటికొచ్చి చూస్తే అంతా రచ్చ రచ్చ గా ఉందని, అలా ఎందుకు చేసారు అని అడుగుదామని బెల్లంకొండ సురేష్ ఇంటికి తన పనివాళ్లను పంపగా, అక్కడ తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుందని, సురేష్ అనుచరులు తన పనివాళ్లపై దాడికి కూడా ప్రయత్నించారని శివప్రసాద్ తన పిటిషన్ లో పేర్కొన్నాడు. శివ ప్రసాద్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఫిల్మ్‌నగర్ పోలీసులు.. బెల్లంకొండ సురేశ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Land grabbing case against prominent Tollywood producer:

Case filed against film producer Bellamkonda Suresh

Tags:   BELLAMKONDA SURESH
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ