Advertisementt

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ రిలీజ్ ఫిక్సైందా

Tue 09th Dec 2025 03:44 PM
ustaad bhagat singh  ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్  రిలీజ్ ఫిక్సైందా
Big Plans Ahead For Ustaad Bhagat Singh ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ రిలీజ్ ఫిక్సైందా
Advertisement
Ads by CJ

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌థానాయ‌కుడిగా హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో `ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ప‌వ‌న్ క‌ళ్యాణ్ పోర్ష‌న్ పూర్తి చేసారు. కొంత పెండింగ్ షూటింగ్ పూర్తి చేయాల్సి ఉంది.  అయితే అవ‌న్నీ ప‌వ‌న్ కాంబినేష‌న్ సీన్స్ కాబ‌ట్టి వేగంగానే  పూర్తి చేస్తున్నారు. తాజా షెడ్యూల్ లో ప‌వ‌న్ మిన‌హా ప్ర‌ధాన పాత్ర‌ధారులంతా హాజ‌ర‌వుతున్నారు. అలాగే లిరిక‌ల్ సింగిల్స్ ఒక్కోక్క‌టిగా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

సంక్రాంతి కానుక‌గా టీజ‌ర్, ట్రైల‌ర్ రిలీజ్ చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నారు. సినిమా రిలీజ్ లేక‌పోయినా? అభిమానుల కోసం ఏదో ఒక ట్రీట్ త‌ప్ప‌ని స‌రిగా ఉంటుంది. అన్న‌య్య చిరంజీవి న‌టిస్తోన్న `మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ గారు` ఎలాగూ సంక్రాంతి కి రిలీజ్ అవుతుంది. కాబ‌ట్టి ఆ సినిమాకు టీజ‌ర్..ట్రైల‌ర్ లాంటిది ఎటాచ్ చేస్తే అభిమానుల్లో డ‌బుల్ జోష్ నింపిన‌ట్లు అవుతుంది. అన్న‌ద‌మ్ములిద్ద‌ర్నీ ఒకే ప్రేమ్ లో చూడ‌టం ఇప్ప‌ట్లో సాధ్యం కాదు కాబ‌ట్టి?  ఈ ర‌కంగానైనా సంతోష పెట్టిన‌ట్లు అవుతుంది.

మ‌రి రిలీజ్ సంగ‌తేంటి? అంటే? ఆ విష‌యం కూడా లీకైంది. ఈ చిత్రాన్నిస‌మ్మ‌ర్ లో రిలీజ్ చేస్తార‌నే ప్రచారం మొద‌లైంది.  అయితే ఏప్రిల్ లో రిలీజ్ అవుతుందా?  మేలో రిలీజ్ చేస్తారా? అన్న సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. ఈ నేప‌థ్యం లో హ‌రీష్ శంక‌ర్ ఏప్రిల్ మిడ్ లో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్న‌ట్లు ఆయ‌న అత్యంత స‌న్నిహిత వ‌ర్గాల నుంచి తెలిసింది. మార్చి ముగింపుక‌ల్లా అన్ని  ప‌నులు పూర్తి చేయాల‌ని..ఆ ర‌కంగానే హ‌రీష్ ముందుకు వెళ్తున్న‌ట్లు చెబుతున్నారు.

భారీ యాక్ష‌న్ సినిమా కాదు కాబ‌ట్టి విజువ‌ల్ ఎఫైక్స్ట్, సీజీ వ‌ర్క్ కూడా పెద్ద‌గా ఉండ‌దు. ఈ నేప‌థ్యంలో హీరీష్ ఏప్రిల్ రిలీజ్ పై కాన్పిడెంట్ గా క‌నిపిస్తున్నాడని తెలుస్తోంది. ఏప్రిల్ రిలీజ్  అంటే?  స‌మ్మ‌ర్ సెల‌వులు కూడా మొద‌లైపోతాయి. మే రిలీజ్ అయితే ఎండ తీవ్ర‌త కూడా ఎక్కువ‌గా ఉంటుంది కాబ‌ట్టి జ‌నాలు థియేట‌ర్ కు రావ‌డానికి భ‌య‌ప‌డ‌తారు. ఈనేప‌థ్యంలో హ‌రీష్ ముందుగానే రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది.

Big Plans Ahead For Ustaad Bhagat Singh :

  Ustaad Bhagat Singh Release Plans  

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ