అందాల రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రంతో బిగ్ బ్రేక్ అందుకుంది. ప్రభాస్ కజిన్ సిద్ధార్థ్ హీరోగా పరిచయమైన కెరటం చిత్రంతో కథానాయికగా అవకాశం అందుకుంది ఈ బ్యూటీ. ఆ తర్వాత సందీప్ కిషన్ తో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ బంపర్ హిట్. ఆ విజయం తర్వాత కెరీర్ పరంగా వెనుదిరిగి చూసిందే లేదు. టాలీవుడ్ అగ్ర హీరోలు చరణ్, ఎన్టీఆర్, మహేష్ లతో వరుసగా అవకాశాల్ని అందుకుంది. తమిళంలోను పలువురు అగ్ర హీరోలు అవకాశాలిచ్చి ఎంకరేజ్ చేసారు. కానీ అనూహ్యంగా బాలీవుడ్ కి వెళ్లిపోయింది రకుల్.
అయితే కెరీర్ ప్రారంభంలో కాస్టింగ్ డైరెక్టర్లతో తన అనుభవాల గురించి ఓపెనైంది రకుల్ ప్రీత్. తాను అప్పటికి పరిశ్రమలో చాలా అమాయకంగా ప్రవేశించానని, ముంబైలో అడుగుపెట్టాక చాలా సవాళ్లు ఎదురయ్యాయని తెలిపారు. ``నేను వస్తాను.. ఆడిషన్స్ ఇస్తాను..ఆ తర్వాత మంచి పాత్రలు లభిస్తాయి`` అనుకునేదానిని అని తెలిపింది. అయినా అవకాశాలు రాలేదు. కాస్టింగ్ డైరెక్టర్లకు ఒకటికి పది సార్లు కాల్ చేసేదానిని... వారికి విసుగొచ్చి చివరికి ఫోన్ తీసేవరకూ వదిలి పెట్టేదానిని కాదు! అని కూడా రకుల్ వెల్లడించింది. రకుల్ ప్రస్తుతం హిందీ చిత్రసీమలో వరుస చిత్రాల్లో నటిస్తోంది. ఇటీవలే దేదే ప్యార్ దే 2 చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకుంది.




నటుడి వార్నింగ్..ఇండస్ట్రీలో ఎవరెవరికి
Loading..