ఇమ్మన్యుయెల్ నా బిడ్డ, నేను ఇమ్ము నవ్వు చూసే హౌస్ లో ఉంటున్నా, ఇమ్మానుయేల్ ని నేను నామినేట్ చెయ్యలేను అని చెప్పే సంజన విషయంలో ఇమ్మన్యుయెల్ కూడా అంతే ప్రేమగా ఉంటున్నాడు. ఆమె ఏ తప్పు చేసినా సర్ది చెబుతున్నాడు. కొన్ని వారాల క్రితం రీతూ చౌదరిని నామినేట్ చేస్తూ సంజన చేసిన చీప్ కామెంట్స్ విషయంలో ఇమ్మాన్యుయేల్ నొచ్చుకున్నాడు. సంజన గారు మీరు ఆ మాటలు వెనక్కి తీసుకోమని వాదులాడాడు, కానీ సంజన ఒప్పుకోలేదు. దానితో వారిద్దరూ కాస్త ఎడ మొహం పెడ మొహంగానే ఉంటున్నారు.
తనూజ రెండుమూడు సార్లు సంజనకు ఇమ్మాన్యుయేల్ కి మధ్యన ఫైట్ పెట్టాలని చూసింది. కానీ సంజన క్లారిటీగా ఉంది. చివరి వారం, టాప్ 5 కి వెళ్లేందుకు పోటీపడుతున్న వారంలో మాత్రం ఇమ్మాన్యుయేల్ vs సంజన అన్నట్టుగా మారిపోయింది. గేమ్స్ లోను, అలాగే గ్రూప్స్ లోను ఒకరినొకరు విభేదిస్తున్నారు. టాప్ 5 కి వెళ్లే సెకండ్ ఫైనలిస్ట్ పోరులో లాస్ట్ గేమ్ లో సంజన ఇమ్మాన్యుయేల్ ఇద్దరూ భీభత్సంగా గొడవపడ్డారు. ఎంతగా అంటే ఇమ్మాన్యుయేల్ మనసు విరిగిపోయేంతగా.. సంజన మాటలనేసింది.
సంజన ఏడుపు స్టార్ట్ చేసింది, చేతిలోని బాటిల్ విసిరేసింది. ఈ వారం మొత్తం నన్ను ఏం పోట్రె చెయ్యాలని ఆమె చూస్తుంది అంటూ ఇమ్మాన్యుయేల్ బాధపడ్డాడు. తర్వాత తనూజ కి ఇమ్మాన్యుయేల్ కి పడిన గేమ్ లో ఇమ్మాన్యుయేల్ కి కాలు ఫ్రాక్చర్ అయినట్లుగా ప్రోమోలో చూపించారు. మరి ఇమ్ము కి ఏమైందో అనేది ఈ రోజు ఎపిసోడ్ లో చూడాలి.




ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇంతకంటే ఏం కావాలి 
Loading..