అఖండ 2 తాండవం వారం ముందు క్రేజీగా విడుదలకావాల్సి ఉండగా కొన్ని అడ్డంకులను దాటుకుని ఫైనల్ గా నేడు డిసెంబర్ 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 11 రాత్రి నుంచే అఖండ 2 ప్రీమియర్స్ తో సందడి చేసింది. అయితే సోషల్ మీడియా మొత్తం అఖండ 2 అద్భుతం, బాలయ్య కనిపించలేదు శివుణ్ణి చూసినట్టే ఉంది, అఖండ ఇంటర్వెల్ బ్యాంగ్ లో గూస్ బంప్స్ వస్తున్నాయి.
బాలయ్య శివతాండవమాడేసారు, బాలయ్య-బోయపాటి కాంబో అంటే హిట్ మిషన్, థమన్ BGM తో తాండవమాడేసాడు, అఖండ 2 సూపర్ అంటూ మాట్లాడుకుంటుంటే.. క్రిటిక్స్ మాత్రం అఖండ 2 కి మిక్స్డ్ రివ్యూస్ ఇవ్వడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. అదే విషయాన్ని అఖండ 2 సక్సెస్ మీట్ లో నిర్మాత రామ్ ఆచంట కూడా ఒప్పుకున్నారు.
అఖండ 2 తాండవం పై బయట నెగిటివిటి లేదు, కానీ సినిమా ఇండస్ట్రీలో అఖండ 2 పై నెగిటివిటి ఉంది, అంతేకాకుండా అఖండ 2కి మిక్స్డ్ రిపోర్ట్స్ వస్తున్నాయి, పబ్లిక్ నుంచి మాత్రం అఖండ 2 కి సూపర్ రెస్పాన్స్ ఉంది అంటూ ఆయన చెప్పడం చూస్తే అదే నిజమనిపిస్తుంది.
బాలయ్య డ్యూటీ లో ఎలాంటి లోపం లేకపోయినా.. బోయపాటి స్టోరీ లైన్ కి అందరూ మిక్స్డ్ రెస్పాన్స్ చూపిస్తున్నారు. చూద్దాం ముందుముందు అఖండ 2 కలెక్షన్స్ ని బట్టి సినిమా రిజల్ట్ ఏమిటి అనేది డిసైడ్ అవుతుంది.




BB9: ఇమ్మానుయేల్-సంజన మధ్యన ఫైట్ 
Loading..