జనసేన పార్టీ స్థాపించినప్పటినుంచి పార్టీలో కీలకంగా పని చేసిన నాగబాబు కు డిప్యూటీ సీఎం హోదాలో ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ ఎమ్యెల్సీ ఇప్పించారు. నాగబాబు ఎమ్యెల్సీ గా ప్రమాణం చేసాక ఆయనను ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్ లోకి తీసుకుంటారనే ప్రచారం జోరుగా జరిగింది.
నాగబాబు కూడా ఎమ్యెల్సీ అయ్యాక ఆ వెంటనే పిఠాపురం వెళ్లి అక్కడ హడావిడి చేసారు. కానీ అక్కడ టీడీపీ కార్యకర్తలు, టీడీపీ వర్మ అనుచరులు నాగబాబు ని తీవ్రంగా వ్యతిరేఖించారు. ఆతర్వాత పవన్ కళ్యాణ్ నాగబాబు ని సైలెంట్ గా ఉండమన్నారో లేదంటే, మారేదన్న విషయముందో తెలియదు కానీ.. నాగబాబు కామ్ అయ్యారు.
అయితే నాగబాబు ని ఈ ఏడాది క్యాబినెట్ లోకి తీసుకునే ఛాన్స్ లేదు. నాగబాబు మంత్రి అవ్వకుండానే ఈఏడాది అంటే 2025 కి ముగింపు పలకబోతున్నారు. ఎమ్యెల్సీగా నాగబాబు చంద్రబాబు క్యాబినెట్ లో మినిస్టర్ అవుతారని ఆయనతో పాటుగా చాలామంది ఆశపడినా అది ఈ ఏడాది మాత్రం జరగలేదు.




బిగ్ బాస్ సీజన్ 9 ప్రైజ్ మనీ రివీల్ 
Loading..