Advertisementt

ఇలా అయితే అఖండ 2 కష్టమే

Tue 16th Dec 2025 08:14 PM
akhanda 2  ఇలా అయితే అఖండ 2 కష్టమే
Akhanda 2 is facing a mixed response at the box office ఇలా అయితే అఖండ 2 కష్టమే
Advertisement
Ads by CJ

అఖండ 2 తాండవం పై ఎన్ని అంచనాలైతే ఉన్నాయో.. అవన్నీ డిసెంబర్ 5 నే పోయాయి. సినిమా లాస్ట్ మినిట్ లో వాయిదా పడడం ఓపెనింగ్స్ పై ఆ ఎఫెక్ట్ బాగా పడింది. డిసెంబర్ 12 న పోటీ లేకపోయినా మేకర్స్ ఎక్స్ పెక్ట్ చేసిన కలెక్షన్స్ అఖండ 2కి రాలేదు. పాన్ ఇండియా మార్కెట్ లో అఖండ2 తాండవమాడుతుంది అనుకుంటే పాన్ ఇండియా మార్కెట్ లోను అఖండ 2 సత్తా చాటలేకపోయింది. 

వీకెండ్ లోనే అఖండ 2 చాలావరకు డ్రాప్ అయ్యింది. ఇక సోమవారం వచ్చేసరికి మల్టిప్లెక్స్ లు ఎలా ఉన్నా బిసి సెంటర్స్ లో ఆక్యుపెన్సీ కనిపించలేదు. అంటే సోమవారం అఖండ 2 కి చాలా తక్కువ కలెక్షన్స్ వచ్ఛినట్టే. సోమవారం 5 నుంచి 6 కోట్ల మధ్యన గ్రాస్ వచ్చినట్టుగా తెలుస్తుంది. మేకర్స్ కూడా అఖండ 2  కలెక్షన్స్ పోస్టర్స్ అఫీషియల్ గా వదలడం లేదు. అఖండ 2 కి ఈ కలెక్షన్స్ చూసి అభిమానులే ఖంగు తింటున్నారు. 

ముఖ్యంగా నార్త్ లో అఖండ 2 పెరఫార్మెన్స్ బావుంటుంది అనుకుంటే అక్కడ అఖండ 2 కి ధురంధర్ దెబ్బ గట్టిగా తగిలి వెలవెలబోవడం అభిమానులను మరింతగా టెన్షన్ పెట్టింది. మీసం మెలేసి తిప్పే బాలయ్య కు అఖండ 2 రిజల్ట్ అవమానమే అంటూ ఓ వర్గం ఆడియన్స్ కామెంట్స్ చేస్తుంటే అది చూసి ఫ్యాన్స్ కూడా డిజప్పాయింట్ అవుతున్నారు. ఇలా అయితే అఖండ 2 ఒడ్డున పడడం కష్టమే అంటూ నెటిజెన్స్ మాట్లాడుతున్నారు. 

Akhanda 2 is facing a mixed response at the box office:

Nandamuri Balakrishna Akhanda 2 is facing a mixed response at the box office

Tags:   AKHANDA 2
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ