కరోనా క్రైసిస్ తర్వాత ప్రజలు ఓటీటీలకు బాగా అలవాటు పడ్డారు. చాలా మంది అల్పాదాయ వర్గాలకు ఓటీటీలే వినోదం అందిస్తున్నాయి ఈ రోజుల్లో. థియేటర్ కి వెళ్లి ఒక చిన్న ఫ్యామిలీకి వేలు ఖర్చు చేసే పరిస్థితి చిరుద్యోగులు, సామాన్యులకు సాధ్యం కానిదిగా మారింది. దీనికి కారణం అధిక ధరలు. అదుపు తప్పుతున్న టికెట్ ధరకు తోడు, పార్కింగ్ ఫీజు, థియేటర్ లో తిండి- కోక్ ల ధరలు కూడా సామాన్య మధ్యతరగతిని థియేటర్లకు రానివ్వకుండా చేస్తున్నాయి.
మల్లీప్లెక్సుల్లో ఒక కాఫీ కోసం 350 చెల్లించాలా? ఒక పాప్ కార్న్ డబ్బా కోసం 300 పైగా చెల్లించాలా? కోక్ ల కోసం సమోసాల కోసం వందలు ఎక్కడి నుంచి తేవాలి? థియేటర్లలో దోపిడీకి అడ్డూ ఆపూ లేదా? అని సామాన్యులు వాపోతున్నారు.
ఇప్పుడు హీరో శివాజీ కూడా ఇదే విషయంపై మాట్లాడారు. థియేటర్లలో తిండి పదార్థాల ధరలు నిజంగా షాకిస్తున్నాయని ఆయన అన్నారు. ఒక కాఫీ కోసం 350 చెల్లించడం సరైనదేనా? దాంతో ఇంటిల్లిపాదీ కాఫీ తాగి ఉండగలరని అన్నారు. ధరల కారణంగానే జనం ఓటీటీలను ఆశ్రయిస్తున్నారని కూడా విశ్లేషించారు. దీనికి తోడు మల్టీప్లెక్సుల్లోనే మద్యం కౌంటర్లు తెరవాలని చాలా ప్రయత్నాలు సాగుతున్నాయి. దీనికోసం మల్టీప్లెక్స్ అసోసియేషన్లు కూడా చాలా ట్రై చేస్తున్నాయని తెలిసింది. అయితే దీనికి ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతులు లభించలేదు.




రామ్ చరణ్ కంటే ప్రభాసే ముందున్నాడా
Loading..