మిరాయ్ తో సక్సెస్ ట్రాక్ ఎక్కిన మంచు వారబ్బాయి మంచు మనోజ్ ప్రస్తుతం దూకుడుమీదున్నాడు. వరస కమిట్మెంట్స్ తో నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. అంతేకాకుండా ఇతర హీరోల సినిమా ఈవెంట్స్ లోను మెరుస్తున్నాడు. ఇండియాలో ఎక్కువగా కనిపిస్తూ హడావిడి చేస్తున్న మనోజ్ లేటెస్ట్ చిత్ర గ్లింప్స్ ని లాంచ్ చేసారు.
సౌండ్ ఆఫ్ డేవిడ్ రెడ్డి పేరుతో రిలీజైన గ్లింప్స్ అభిమానులను బాగా ఇంప్రెస్స్ చేసాయి. అయితే ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ శింబు ఓ స్పెషల్ రోల్ చేస్తున్నారు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్యామియో చేస్తున్నారంటూ ప్రచారం జరుగుతుంది. ఈ విషయమై మనోజ్ డేవిడ్ రెడ్డి గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడారు.
ఈ సినిమాలో చాలా ఆసక్తికరమైన పాత్రలు కొన్ని ఉన్నాయి. కానీ మేము ఇప్పటివరకు ఏ పాత్ర కోసము రామ్ చరణ్‌ను అడగలేదని స్పష్టం చేశాడు. ఇప్పుడే సినిమా స్టార్ట్ అవుతోంది. ఇందులో నటీనటుల గురించి అప్పుడే మాట్లాడడం తొందర అవుతుందని.. మిగతా విశేషాలు పంచుకోవడం కోసం కొన్ని రోజులు వెయిట్ చేయాలని మంచు మనోజ్ చెప్పుకొచ్చాడు.




రాజా సాబ్ ఈవెంట్- నిధి కి చేదు అనుభవం 
Loading..