ఒకప్పుడు `ఏ `సర్టిఫికేషన్ తో సినిమా రిలీజ్ అయిందంటే దాన్నో బూతు బొమ్మగా చూసేవారు. ఆ థియేటర్ వైపు కూడా ప్రేక్షకులు వెళ్లడానికి భయపడేవారు. `ఏ` సర్టిఫికెట్ అన్నది కేవలం అడల్ట్ కంటెంట్ కి మాత్రమే ఇస్తారు? అన్నది అప్పట్లో చాలా మందిలో ఉండే ఓ ఆపోహ. కాలక్రమంలో `ఏ` అనేది హింసతో కూడిన చిత్రాలకు కూడా ఇస్తారని, ఇంకా రకరకాల కారణాలతో `ఏ `సర్టిఫికేషన్ తో సినిమాలు రిలీజ్ అవుతుంటాయి? అని సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక మరింత అవేర్ నెస్ వచ్చింది.
అప్పటి నుంచి `ఏ` సర్టిఫికేషన్ అంటే బూతు బొమ్మ అనే అపోహ తొలగిపోయి? అసలైన మజా అందించే చిత్రాలుగా మారాయి. ఇప్పుడు సినిమాకు `ఏ` సర్టిఫికెట్ అన్నది ఓ బ్రాండ్ గా మారిపోయింది. సెన్సార్ నుంచి `ఏ`సర్టిఫికెట్ జారీ అయిందంటే కళ్లకు హత్తుకుని మరీ తీసుకుంటున్నారు. ఓ సెక్షన్ ఆడియన్స్ కు సినిమా రీచ్ అవ్వదని..18 ఏళ్ల లోపు ఉన్న పిల్లలకు థియేటర్ లోకి ఎంట్రీ ఉండదని? తెలిసినా? అవేమి పట్టించుకోకుండా `ఏ` సర్టిఫికేషన్ ఇచ్చినా తీసుకుంటున్నారు.
మరి దీని వల్ల సినిమాకు లాభమా? నష్టమా? అంటే? నష్టం కంటే లాభాలే కనిపిస్తున్నాయి. ఇలా `ఏ` సర్టిపికెట్ వచ్చిందంటే? ఆ సినిమా జనాల్లోకి బలంగా వెళ్తుంది. ఏదో విషయం ఉంది కాబట్టే `ఏ` ఇచ్చారు? అన్న అపోహ నుంచి బ్రహ్మాండం దిశగా ఆలోచన చేస్తున్నారు. కచ్చితంగా థియేటర్లో చూడాల్సిన చిత్రంగా చాలా మంది ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవలే బాలీవుడ్ చిత్రం `ధురంధర్` `ఏ` సర్టిఫికేషన్ తోనే రిలీజ్ అయింది.
భారీ హింస కారణంగా సెన్సార్ అలా ఇష్యూ చేసింది. ఈ సినిమా ఇప్పుడు ఏకంగా 500 కోట్లకు పైగా వసూళ్లే సాధించింది. రణవీర్ సింగ్ కెరీర్ లో తొలి భారీ వసూళ్ల చిత్రంగా రికార్డు సృష్టించింది. `మార్కో` రిలీజ్ కు ముందు వరకూ మలయాళం యాక్షన్ సినిమాలంటే జనాలు లైట్ తీసుకునేవారు. కానీ `మార్కో` భారీ యాక్షన్ థ్రిల్లర్ `ఏ` సర్టిఫికేషన్ తో రిలీజ్ 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇంకా ఇలా `ఏ` సర్టిపికెట్ తో వందల కోట్లు సాధించిన చిత్రాలెన్నో ఉన్నాయి.




పెళ్లి కోసం రష్మిక షాపింగ్ 
Loading..