ఈటివి లో మల్లెమాల యాజమాన్యం జబర్దస్త్ కామెడీ షో స్టార్ట్ చేసి చాలామంది కమెడియన్స్ కి లైఫ్ ఇచ్చింది. ఆ కామెడీ షో విపరీతంగా పాపులర్ అవడమే కాదు, అందులో కనిపించిన వారంతా ఫేమస్ అయ్యారు. వేణు, ధనరాజ్, చమ్మక్ చంద్ర, సుధీర్, ఆది, శ్రీను ఇలా చాలామంది జబర్దస్త్ లో ఫేమస్ అయ్యి డబ్బు, పేరు సంపాదించారు.
ఆతర్వాత కొంతమంది నాగబాబు కూడా వేరే ఛానల్ కోసం బయటికెళ్లిపోయారు. అందులో చమ్మక్ చంద్ర ఒకడు. తాజాగా అతను ఎందుకు జబర్దస్త్ కి దూరమయ్యాడో, ఎవరి వల్ల జబర్దస్త్ ని వదలాల్సి వచ్చిందో ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. ఈ ప్రపంచానికి చమ్మక్ చంద్ర అని ఎవరికైనా తెలిసిందంటే దానికి కారణం జబర్దస్త్ కామెడీ షో.
అసలు జబర్దస్త్ లేకపోతే చమ్మక్ చంద్ర లేడు. అలాంటి పేరు ఇచ్చిన షోను వదిలేసి వేరే షోకి ఎందుకు వెళ్లారు అని చాలామంది అడుగుతుంటారు, జబర్దస్త్ షో స్టార్ట్ అయినప్పుడు నితిన్, భరత్ అనే ఇద్దరు డైరెక్టర్లు ఉన్నారు, వారితో తాను ఏడు సంవత్సరాల పాటు జర్నీ చేశాను.
ఆ తర్వాత నితిన్, భరత్ ఇద్దరూ మల్లెమాల ను జబర్దస్త్ ను విడిచి జీ తెలుగుకు వెళ్లారు. వాళ్లు నాకు సపోర్ట్ కోరారు. వాళ్ల కోసం నేను జబర్దస్త్‌ను విడిచిపెట్టాల్సి వచ్చింది అంతేకాని యాజమాన్యంతో కానీ, ఈనాడు సంస్థ లతో ఎలాంటి గొడవ లేదు, ఇప్పటికి వారితో తనకు మంచి అనుబంధమే ఉంది అంటూ చమ్మక్ చంద్ర చెప్పుకొచ్చాడు.




ఏ సర్టిఫికెట్ తో లాభమా నష్టమా
Loading..