ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక హీరో అంటే అంటే ఒక హీరో ఫ్యాన్స్ కి పడడం లేదు. ఏ హీరో సినిమా కంటెంట్ బయటికి వచ్చినా అందులో ఎక్కడా తప్పు పడదామా, ఎక్కడ ట్రోల్ చేసే కంటెంట్ ఉంటుందా అని యాంటీ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. రీసెంట్ గా అఖండ 2 రిలీజ్ అయ్యాక సోషల్ మీడియాలో ఎంత ట్రోలింగ్ జరిగిందో చూసారు.
తాజాగా రాజా సాబ్ వంతొచ్చింది. మారుతి దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ద రాజా సాబ్ జనవరి 9 సంక్రాంతి స్పెషల్ గా విడుదలకు సిద్దమవుతుంది. ప్రస్తుతం టీమ్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. ప్రభాస్ లేకుండానే హీరోయిన్స్, దర్శకుడు మారుతి, ప్రొడ్యూసర్ లు రాజాసాబ్ ప్రమోషన్స్ చేస్తున్నారు.
అయితే రాజాసాబ్ ట్రైలర్ హర్రర్ కామెడీగా ఆకట్టుకున్నప్పటికీ రీసెంట్ గా విడుదలైన సింగిల్ అంతగా ట్రెండ్ కాలేదు. అదే అభిమానులను తొలిచేస్తోంది. ఇక నిన్న విడుదలైన రెండో పాట పై ఇప్పుడు భీబత్సంగా ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి.
ఆ పాటలోని ప్రభాస్ లుక్స్, అలాగే ఆయన డాన్స్ స్టెప్స్ పై సోషల్ మీడియాలో మీమ్స్ చేస్తున్నారు. ప్రభాస్ కి మోకాలి నెప్పి ఉందిరా అందుకే స్టెప్ సరిగ్గా వెయ్యలేకపోతున్నారని కొందరు, ఆయన తలపాగా గెటప్ పై మరికొందరు కామెడీగా మాట్లాడుతున్నారు. ప్రభాస్ డాన్స్ చించేస్తారు అనుకుంటే ఇంత డిజప్పాయింట్ చేసాడేమిటి అంటూ మట్లాడడం ప్రభాస్ ఫ్యాన్స్ ని ఆందోళనకు గురి చేసింది.




ట్రెడిషనల్ అయినా అద్భుతమే
Loading..