బిగ్ బాస్ హౌస్ లోకి హీరోలా అడుగుపెట్టిన కామన్ మ్యాన్ డిమోన్ పవన్ టాస్క్ పెరఫార్మెన్స్ ల్లో హీరోగా కనిపించి రీతూ తో ఫ్రెండ్ షిప్ అంటూ కమ్ ఫర్ట్ జోన్ లోకి వెళ్ళిపోయి ఆట మొత్తం చెడగొట్టుకుని, అదే రీతూ తో గొడవపడిన సందర్భంలో కింగ్ నాగార్జున చేత తిట్లు తిని రీతూ కి మోకాళ్లపై కూర్చుని సారీ చెప్పి జీరో అయ్యాడు.
కానీ రీతూ ఎప్పుడైతే ఎలిమినేట్ అయ్యిందో అప్పుడే పవన్ లోని కామెడీ యాంగిల్ బయటికి వచ్చింది. తనూజ తో కలిసి సరదాగా మాట్లాడడం, కళ్యాణ్ పడాల, ఇమ్మాన్యుయేల్ తో కలిసి సరదాగా కనిపించడమే కాకుండా లాస్ట్ వారంలో డిమోన్ పవన్ టాస్క్ ల్లో చితక్కొట్టేసాడు. బిగ్ బాస్ కూడా డిమోన్ పవన్ జర్నీ వీడియో లో సూపర్ ఎలివేషన్ ఇచ్చారు.
అయితే రీతూ ఎలిమినేట్ అయ్యాక పవన్ గెలవాలని కోరుకుంది. ఆమె ఏ ఇంటర్వ్యూలో చెప్పినా తనకు డిమోన్ పవన్ గెలవాలని చెబుతుంది. ఇప్పుడు డిమోన్ పవన్ గెలవాలంటూ తన స్నేహితులతో కలిసి క్యాంపెయిన్ మొదలుపెట్టింది. పవన్ ని గెలిపించేందుకు రీతూ తన సపోర్ట్, తన అభిమానుల సపోర్ట్, తన స్నేహితుల తో సపోర్ట్ ఇస్తుంది. చూద్దాం రీతూ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో.




ధర్మేంద్ర ఆస్తి కోసం సవతుల పోరు
Loading..