బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ధురంధర్. డిసెంబర్ 5 న విడుదలైన ధురంధర్ చిత్రం దూకుడు మాములుగా లేదు. మూడో వారంలోకి ఎంటర్ అవుతున్నా ధురంధర్ కలెక్షన్స్ తగ్గడం లేదు. బాలీవుడ్ లో ఛావా తర్వాత అంత పెద్ద హిట్ ధురంధర్ అనే చెప్పాలి.
బాక్సాఫీసు దగ్గర కలెక్షన్స్ వర్షం కురిపిస్తున్న ధురంధర్ చిత్రానికి సంబందించిన ఓ న్యూస్ ఇపుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. అది ధురంధర్ డిజిటల్ హక్కుల కోసం జరిగిన డీల్ లో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ దిమ్మతిరిగే డీల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అది కూడా కనివిని ఎరుగని రేంజ్ లో.
ధురంధర్ సినిమాకి ఏకంగా 285 కోట్లు నెట్ ఫ్లిక్స్ చెల్లించిట్టుగా పలు రూమర్స్ మొదలయ్యాయి. గతంలో ధురంధర్ రెండు భాగాలకు కలిపి నెట్ ఫ్లిక్స్ 130 కోట్లకి పైగా వెచ్చించి డిజిటల్ హక్కులు కొనుగోలు చేసింది అంటే.. ఇప్పుడు 285 కోట్ల భారీ డీల్ అంటున్నారు. మరి ఇదే నిజమైతే మాత్రం ఇండియన్ ఓటిటి హిస్టరీ లోనే ధురంధర్ డీల్ ఒక షాకింగ్ డీల్ అని చెప్పాల్సిందే.





Loading..