యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్న కన్నడ హీరోయిన్ రుక్మిణి వసంత్ ట్రెడిషనల్ లుక్ నుంచి గ్లామర్ లుక్ లోకి చేంజ్ అవుతుంది. కాంతార 2 లో యువరాణి గా పాన్ ఇండియా ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన రుక్మిణి వసంత్ సోషల్ మీడియా లుక్స్ చూసి ఆమె అభిమానులే అవాక్కవుతున్నారు.
గతంలో శారీస్ లోను, చుడీదార్స్ లోను అద్దరగొట్టే రుక్మిణి వసంత్ కొద్దిరోజులుగా గ్లామర్ గా టర్న్ అయ్యింది. తాజాగా రుక్మిణి వసంత్ నుంచి వచ్చిన పిక్స్ చూస్తే సో బ్యూటిఫుల్ అనాల్సిందే. స్లీవ్ లెస్ గౌన్ లో రుక్మిణి వసంత్ గ్లామర్ గా కనిపించినా అందులో సాంప్రదాయం కొట్టొచ్చినట్టుగా కనిపించింది.
కాంతార 2 తర్వాత రుక్మిణి వసంత్ అటు క్రేజీ పాన్ ఇండియా స్టార్ యష్ టాక్సిక్ అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్-నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్(వర్కింగ్ టైటిల్) లో నటిస్తుంది.




BB9: కళ్యాణ్ పడాల జర్నీ మొత్తం తనూజానే
Loading..