బిగ్ బాస్ సీజన్ 9 ప్రస్తుతం గ్రాండ్ ఫినాలే షూట్ జరుగుతుంది. టాప్ 5 నుంచి ఒక్కోక్కరిని ఎలిమినేట్ చేస్తూ మధ్య మధ్యలో సెలబ్రిటీస్ ని బిగ్ బాస్ హౌస్ లోకి పంపుతూ నాగార్జున గ్రాండ్ ఫినాలే ని హోస్ట్ చేస్తున్నారు. క్రిష్టమస్ కి విడుదలయ్యే సినిమాలు, సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాలను ప్రమోట్ చేస్తూ హీరోలు, హీరోయిన్స్ బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేస్తున్నారు,.
ఇక టాప్ 5 నుంచి ముందుగా సంజన ఎలిమినేట్ అయిట్లుగా తెలుస్తుంది. టాప్ 4 నుంచి డిమాన్ పవన్ ఎలిమినేట్ అవుతాడనుకుంటే.. షాకింగ్ గా ఇమ్మాన్యుయేల్ ని టాప్ 4 నుంచి ఎలిమినేట్ చెయ్యడం ఆయన అభిమానులకే కాదు చాలామందికి షాకిచ్చింది. నామినేషన్స్ లోకి రాక అభిమానుల సపోర్ట్ తగ్గిన ఇమ్ము హౌస్ లో చాలా ఎంటర్టైన్ చేసాడు, టాస్క్ ల్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ తో తలపడి గెలిచాడు.
హౌస్ లో మూడుసార్లు కెప్టెన్ అయ్యాడు. అందరితో బావున్న ఇమ్మాన్యుయేల్ అసలు విన్నర్ మెటీరియల్. కానీ కళ్యాణ్, తనూజ ఫ్యాన్ బేస్ ముందు ఇమ్ము తేలిపోయినా టాప్ 3 లో లేదా టాప్ 2 లో ఉంటాడని అనుకున్న వారికి బిగ్ బాస్ షాకిస్తూ టాప్ 3 నుంచి పంపెయ్యడం అన్ ఫెయిర్ అంటూ సోషల్ మీడియాలో ఇమ్ము ఎలిమినేషన్ పై ధ్వజమెత్తుతున్నారు.
ఇక టాప్ 2 లో ఉన్న కళ్యాణ్ పడాల, తనూజ లలో ఎవరు ఈ సీజన్ విన్నర్ అవుతారో అనేది మరికొద్ది గంటల్లో తేలిపోతుంది.




వెంకీ వారసుడు రంగంలోకి
Loading..