Advertisementt

బ‌డ్జెట్ ప‌ద్మనాభం అందుకే అతడే కావాలి!

Tue 13th Jan 2026 09:24 AM
anil ravipudi  బ‌డ్జెట్ ప‌ద్మనాభం అందుకే అతడే కావాలి!
Anil Ravipudi బ‌డ్జెట్ ప‌ద్మనాభం అందుకే అతడే కావాలి!
Advertisement
Ads by CJ

డైరెక్ట‌ర్ అనీల్ రావిపూడికి ఇంత వ‌ర‌కూ వైఫ‌ల్యమే లేదు. చేసిన ఎనిమిది సినిమాలు మంచి విజ‌యాలు సాధించిన‌వే. వీటిలో ఐదు సినిమాలు 100 కోట్ల క్ల‌బ్ లో చేర‌గా, ఓ సినిమా ఏకంగా 300 కోట్ల వ‌సూళ్ల‌తో అతి పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. మ‌రి ఈ సినిమాల‌కు అనీల్ పెట్టిన బ‌డ్జెట్ఎంత అంటే? 60 కోట్ల లోపే ఉంటుంది. ఈ రేంజ్ బ‌డ్జెట్ లో సినిమా చేసి 100 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు అందించాడంటే? అనీల్ ఏ రేంజ్ డైరెక్ట‌ర్ అన్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు.

సినిమా బ‌డ్జెట్ విష‌యంలో  అనీల్ చాలా  క్లారిటీగా ఉంటాడు. నిర్మాత‌కు చెప్పిన బ‌ట్జెట్ లోపే సినిమా పూర్తి చేయ‌డం అత‌డి ప్ర‌త్యేక‌త‌. ఎక్క‌డ అవ‌స‌ర‌మో? అక్క‌డే ఖ‌ర్చు చేస్తాడు. అన‌వ‌స‌రంగా ఖ‌ర్చు చేయ‌డు. పైగా ఏ రోజు ఎంత ఖ‌ర్చు చేస్తున్నాడు? అన్న‌ది అనీల్ వాట్సాప్ కి సాయంత్రానికి వాట్సప్ వ‌చ్చేస్తుంది. ఆ లెక్క ప‌త్రం వివ‌రాలు నిర్మాత‌కు చేరుతాయి. సాధార‌ణంగా బ‌డ్జెట్ విష‌యంలో ఇంత క్లియ‌ర్ గా ఏ డైరెక్ట‌ర్ క‌నిపించ‌డు. ఇలా చేయ‌డం వ‌ల్ల  పార‌దర్శ‌క‌త  ఉంటుంది.

కింద స్థాయిలో అవినీతికి పాల్ప‌డ‌టానికి అవ‌కాశం ఉండ‌దు. ఏ రోజుకారోజు లెక్కా ప‌త్రం వ‌చ్చేస్తే లెక్క అడ‌గ‌డానికి అవ‌కాశం ఉంటుంది. మొత్తం బ‌డ్జెట్ అంతా ఒకే రోజు చెక్ చేయ‌డం అంటే చిన్న విష‌యం కాదు. రిలీజ్ త‌ర్వాత అస‌లే సాధ్య‌ప‌డ‌దు. ఇవ‌న్నీ గ్ర‌హించే అనీల్ ఏ రోజుకారోజు క్లియ‌ర్ గా ఉంటాడు.

ఇలా ఉండ‌టం అన్న‌ది  నిర్మాత‌కు జ‌వాబుదారీ త‌నంగానూ ఉన్న‌ట్లు అవుతుంది. సినిమా ప్ర‌చారం ఖ‌ర్చు కూడా పెద్ద‌గా ఉండ‌దు. అందుబాటులో ఉన్న వారిని వినియోగించుకుని సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌చారం చేసుకుంటాడు. ఈ ర‌కంగా ప‌బ్లిసిటీ ఖ‌ర్చు కూడా క‌లిసొస్తుంది. అందుకే నిర్మాత‌లంతా అనీల్ నే కోరుకుంటారు. అత‌డితో సినిమా అంటే?  హిట్ స‌హా మంచి లాభాలు చూడొచ్చు అన్న‌ది నిర్మాత‌ల విశ్వాసం.  

Anil Ravipudi:

Director Anil Ravipudi

Tags:   ANIL RAVIPUDI
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ