ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి `మనశంకరవరప్రసాద్ గారు`తో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తుంది. దీంతో చిరంజీవి చాలా సంతోషంగా ఉన్నారు. అన్నయ్యలో ఇంత సంతోషం ఈ మధ్య కాలంలో కనిపించలేదు. `వాల్తేరు వీరయ్య`తో కమర్శియల్ గా బాబి మంచి హిట్ ఇచ్చినా? ఆ సంతోషాన్ని మెహర్ రమేష్ `భోళా శంకర్` ప్లాప్ తో కరిగించేసాడు.
`వాల్తేరు వీరయ్య` సక్సెస్ ను ఎంజాయ్ చేసే లోపే `భోళాశంకర్` తీవ్ర నిరాశలోకి నెట్టేసింది. వరప్రసాద్ రిజల్ట్ తో మాత్రం మళ్లీ సంతోషంలో మునిగిపోతున్నారు. ఇప్పటికే వరప్రసాద్ 300 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. సినిమా రిలీజ్ అయి పది రోజులు దాటినా స్టిల్ వసూళ్లు స్థిరంగా ఉన్నాయి. దీంతో 400 కోట్లు కొట్టినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఇదంతా సరే మరి `విశ్వంభర` సంగతేంటి అంటే ఆ సినిమా ఇంకా ల్యాబ్ లోనే ఉంది.
దర్శకుడు వషిష్ట మళ్లీ ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. చిరంజీవి అయితే ఈ సినిమా గురించి ఎక్కడా మాట్లాడింది కూడా లేదు. షూటింగ్ పూర్తయిన దగ్గర నుంచి కూడా అన్నయ్య నోట `విశ్వంభర` మాట రాలేదు. తాజాగా ఈ ప్రాజెక్ట్ విషయంలో చిరంజీవి ఎంత మాత్రం ఉత్సాహంగా లేరనే మాట వినిపిస్తోంది. షూటింగ్ ప్రారంభమైన తర్వాత సెట్స్ కు వెళ్లినప్పుడు ఉన్నంత చలాకీతనం చిరంజీవిలో ఇప్పుడు లేదంటున్నారు.
ప్రచార చిత్రాలు రిలీజ్ తర్వాత ఆయనలో ఎగ్జైట్ మెంట్ తగ్గినట్లు వార్తలొస్తున్నాయి. `విశ్వంభర`పై మీడియా ఫోకస్ కూడా లేదు. దీంతో అసలు `విశ్వంభర` సినిమా ఉందా? లేదా? అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి ఇలా మూడు వేడుకలు జరిగినా? ఒక్క అప్ డేట్ కూడా ఇవ్వకపోవడం అభిమానుల్లోనూ అసంతృప్తి గా మారింది.




బన్నీ కోసం దేవర కంటే ది బెస్ట్ ఆల్బమ్
Loading..