ఎలాంటి అంచనాలు లేకుండా పొంగల్ బరి లో రిలీజ్ అంటూ అనౌన్స్ చేసి అందరిని ఆశ్చర్యపరిచిన శర్వానంద్ నారి నారి నడుమ మురారి ని రాంగ్ టైమ్ లో, బడా హీరోల మధ్య దించుతున్నాడు, శర్వా నలిగిపోవడం ఖాయమన్నారు. కానీ జనవరి 14 భోగి రోజు సాయంత్రం విడుదలైన నారి నారి నడుమ మురారికి యునానమస్ గా హిట్ టాక్ వచ్చేసింది.
కానీ చిరు మన శంకర వరప్రసాద్ గారు, నవీన్ పోలిశెట్టి అనగనగా ఒకరాజు ధాటికి శర్వానంద్ నిజంగానే నలిగిపోయాడు. హిట్ అనిపించుకుంది కానీ కలెక్షన్స్ తేలేకపోయింది. థియేటర్స్ లో హిట్ అయిన నారి నారి నడుమ మురారి చాల ఎర్లీ గా అంటే కేవలం మూడు వారాలు తిరిగేసరికి ఓటీటీ లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది.
ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ తో ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం థియేటర్స్ లో విడుదలైన మూడు వారాలకే నారి నారి నడుమ మురారి ఈరోజు అంటే ఫిబ్రవరి 4 నుంచి స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది. మరి థియేటర్స్ లో నవ్వులు పూయించిన శర్వా నారి నారి ని మిస్ అవ్వకుండా ఓటీటీ లో వీక్షించేయ్యండి.




రెడ్ డ్రెస్ లో ముద్దొస్తున్న రుక్మిణి వసంత్
Loading..