Advertisementt

బాబాయ్-అబ్బాయ్ ఎవరు ఇంప్రెస్స్ చేసారు

Wed 04th Feb 2026 07:16 PM
peddi  బాబాయ్-అబ్బాయ్ ఎవరు ఇంప్రెస్స్ చేసారు
Pawan Kalyan vs Ram Charan బాబాయ్-అబ్బాయ్ ఎవరు ఇంప్రెస్స్ చేసారు
Advertisement
Ads by CJ

ఈరోజు బుధవారం మెగా ఫ్యాన్స్ కి బ్యాక్ టు బ్యాక్ అప్ డేట్స్ అందాయి. అందులో పెద్ది రిలీజ్ డేట్ మార్చేస్తూ మార్చ్ 27 నుంచి ఏప్రిల్ 30 కి వెళ్లినట్టుగా రామ్ చరణ్ పవర్ ఫుల్ లుక్ తో డేట్ ఎనౌన్స్ చేసారు. అదే సమయంలో చరణ్ బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్ అనౌన్సమెంట్ వచ్చేసింది.

మార్చ్ 26 న పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అంటూ పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ లుక్ తో డేట్ అనౌన్స్ చేసారు. ఉస్తాద్ భగత్ సింగ్ డేట్ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ లుక్ చూసాక హరీష్ శనకర్ చెప్పినట్టుగా డీపీలు మార్చకుండా ఉంటారా.. అన్నట్టుగా పవన్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ లుక్ చూసి తెగ ఇంప్రెస్స్ అవుతున్నారు.

అటు రామ్ చరణ్ పెద్ది లుక్ చూసి మెగా ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. అయితే ఒకే రోజు ఒకే సమయానికి వచ్చిన పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ పోస్టర్ బావుందా, రామ్ చరణ్ పెద్ది పోస్టర్ నచ్చిందా అనే విషయంలో ఎక్కువగా పవన్ కళ్యాణ్ లుక్ కే ఓటేస్తున్నారు. చరణ్ పెద్ది లుక్ కన్నా పవన్ లుక్ ఇంప్రెసివ్ గా ఉంది అంటూ కామన్ ఆడియన్స్ కూడా కామెంట్లు పెడుతున్నారు. 

Pawan Kalyan vs Ram Charan:

Ustaad Bhagat SIngh vs Peddi posters

Tags:   PEDDI
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ