‘లింగ’ వివాదం ఇప్పట్లో చల్లారేట్టు లేదు. ఈ సినిమా ఫ్లాప్‌తో రజనీకాంత్ ఇమేజ్ కాస్త డామేజ్ అయింది. ఆ తర్వాత పంపిణీదారుల వ్యవహారం రజనీకి తీవ్రమైన మనస్థాపం కలిగిస్తోంది. ఈ సినిమా వల్ల ఎదురైన కష్టనష్టాలకు రజనీ సమాధానం చెప్పాల్సిందే అని రోడ్డెక్కారు పంపిణీదారులు. ఈ వ్యవహారంలో రజనీకి ఎలాంటి సంబంధం లేదని కోర్టు తీర్పు చెప్పినా పంపిణీదారులు వదలడం లేదు. దాంతో రజనీ డిస్ట్రిబ్యూటర్లపై గరమ్ గరమ్‌గా ఉన్నాడు. రాజకీయంగా తనని ఇరికించాలని, తన ఇమేజ్ డ్యామేజ్ చేయాలనే ఆలోచనతోనే పంపిణీదారులు ఇలా వ్యవహరిస్తున్నారని వాళ్ల వెనుక రాజకీయనాయకుల ప్రమేయం ఉందని రజనీ భావిస్తున్నాడు. దాంతో ఈ విషయాన్ని కోర్టులోనే ఎదుర్కోవాలని రజనీ డిసైడ్ అయ్యాడు. తన పేరుతో రాద్దాంతం చేస్తున్న పంపిణీదారులపై రజనీ కేసు వేయబోతున్నట్లు సమాచారం. ఈ విషయమై ఆయన తన లాయర్లతో కూడా సంప్రదింపులు జరుపుతున్నాడని, త్వరలో తన నిర్ణయాన్ని మీడియాకు చెప్పనున్నాడని కోలీవుడ్ సమాచారం.