Advertisementt

కోదండరామ్‌ మనసులో ఏముంది?

Thu 09th Jun 2016 08:07 PM
kodandaram,tjac,kcr,telangana,kodandaram new party  కోదండరామ్‌ మనసులో ఏముంది?
కోదండరామ్‌ మనసులో ఏముంది?
Advertisement
Ads by CJ

అధికార టిఆర్‌ఎస్‌పై టిజెఏసీ కోదండరామ్‌ భగ్గుమంటున్నారు. ఆయన వ్యాఖ్యలపై అధికార టిఆర్‌ఎస్‌ వైపు నుండి తీవ్ర వ్యతిరేకత రాగా, కాంగ్రెస్‌, తెలుగుదేశం వంటి ప్రతిపక్ష పార్టీలన్నీ కోదండరామ్‌కు మద్దతు పలుకుతున్నాయి. ఈ తరుణంలో కోదండరామ్‌ రాజకీయ పార్టీ స్ధాపించే ఉద్దేశ్యం ఏమైనా ఉందా? అనే అంశంపై కూడా చర్చ జరుగుతోంది. వాస్తవానికి కేసీఆర్‌కు, కోదండరామ్‌కు మధ్య విబేధాలు ఇప్పుడే బయటపడినప్పటికీ వీరిమధ్య మూడేళ్ల నుండి లోలోన అసంతృప్తి భగ్గుమంటూనే ఉందని సమాచారం. ట్యాంక్‌బండ్‌పై మిలియన్‌ మార్చ్‌ నిర్వహించిన సమయంలోనే టిఆర్‌ఎస్‌కు, కోదండరామ్‌కు మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఆ తర్వాత పలు సంఘటనల ద్వారా అవి మరింత పెరుగుతూ వచ్చాయి. ప్రభుత్వ పాలన బాగుందని తొలినాళ్లలో కేసీఆర్‌కు కోదండరామ్‌ కితాబునిచ్చారు. కానీ ఆ తర్వాత కోదండరామ్‌ అమెరికా వెళ్లివచ్చారు. అమెరికా వెళ్లి వచ్చిన తర్వాత కోదండరామ్‌ వైఖరిలో మార్పు వచ్చిందని, అసలు అక్కడేం జరిగిందో చెప్పాలని టిఆర్‌ఎస్‌ విమర్శిస్తోంది. సాధారణ ఎన్నికల సమయంలో కూడా టిఆర్‌ఎస్‌కు ఓటువేయమని కోదండరాం పిలుపునివ్వాలని కేసీఆర్‌ కోరినా కూడా కోదండరామ్‌ దాన్ని తిప్పికొట్టారు. మొత్తానికి తనను విమర్శించే వారే ఉండకూడదని ప్రతిపక్షాలను సైతం మనుగడ లేకుండా చేస్తున్న కేసీఆర్‌ నియంతృత్వ ధోరణికి కోదండరాం అయినా ఎదురు నిలిచి ప్రతిపక్ష పాత్రను పోషిస్తాడా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. కేసీఆర్‌ను చూసి తాను భయపడనని, ఆయన తనపై ఏవిధంగా ఒత్తిడి తెచ్చినప్పటికీ వాటికి లొంగబోనని కోదండరాం చేస్తున్న ప్రకటన తెలంగాణలోని ప్రతిపక్ష నాయకులకు, పార్టీలకు మరలా ఓ ఆశాదీపంగా కనిపిస్తోంది.